Political News

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ అదే ఎన్డీఏనే అధికారం కొనసాగిస్తోంది. నాడు కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇప్పుడు కూడా అదే పదవిలో ఉన్నారు. నాడు సీఎం హోదాలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్ మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు. ఎప్పుడో ఒకసారి అమిత్ షా కరుణించినా హడావిడిగా చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి జగన్ బయట పడిపోయేవారు. ఇప్పుడలా కాదు. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన టీడీపీ యువ ఎంపీలకు అమిత్ షా ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ ఎంపీలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వెరసి ఏపీపై అమిత్ షా ఫోకస్ ఓ రేంజిలో పెరిగిపోయిందనే చెప్పాలి.

ఇటీవలే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు… ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై లోక్ సభలో అదిరేటి ప్రసంగం వినిపించినంతనే.. అమిత్ షా స్వయంగా ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఎంపీ లావు చెబుతుంటే… అమిత్ షా అమితాసక్తితో విన్నారు. లావు ఇచ్చిన వివరాలను ఆయన ఒకంత లోతుగానే పరిశీలించారు. వైసీపీ జమానాలో గుట్టుగా ఇన్నేసి అక్రమాలు.. ఇంత పబ్లిగ్గా జరిగాయా? అంటూ అమిత్ షా ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా లావు అందించిన మద్యం కుంభకోణం వివరాలను అమిత్ షా తన సిబ్బందికి అందజేసి వాటిని భద్రపరచినట్టుగా సమాచారం. సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు తీయడంతో పాటుగా వైసీపీతో పాటు జగన్ భరతం పట్టేందుకు షా సదా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కుమార్ మంగళవారం అమిత్ షాతో బేటీ అయ్యారు. వాస్తవానికి లావుకు ఒకింత రాజకీయ అనుభవం ఉన్నా… సానాకు మాత్రం అంతగా రాజకీయ అనుభవం లేదనే చెప్పాలి. మొన్నటి దాకా వ్యాపారవేత్తగా సాగిన సానా… తెర వెనుకే ఉండి టీడీపీకి చేదోడువాదోడుగా నిలిచారు. అంతేకాకుండా టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇటీవలే వైసీపీ ఎంపీ ల రాజీనామాలతో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల ద్వారా సతీష్ కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో సతీశ్ అడిగారో, లేదంటే… అమిత్ షానే పిలిపించారో తెలియదు గానీ… మంగళవారం అమిత్ షా కార్యాలయంలో ఆయనతో పాటు కలిసి కూర్చుని చర్చలు జరుపుతూ సానా కనిపించారు. ఈ భేటీలో పార్లమెంటులో వ్యవహరించాల్సిన పలు అంశాలపై చర్చలు జరిగాయని సానా తెలిపారు గానీ.. అంతకుమించిన అంశాలపైనే చర్చలు జరిగినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో కొనసాగుతున్నదంటే… ఏపీ ద్వారా కూటమికి అందిన ఎంపీ సీట్లే కారణమని చెప్పక తప్పదు. ఉత్తరాదిన బొటాబొటీ మెజారిటీ వచ్చిన బీజేపీకి దక్షిణాదిన… అది కూడా ఏపీలో నుంచి కూటమి ద్వారా వచ్చిన 21 ఎంపీ సీట్లు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పటికిప్పుడు టీడీపీ మద్దతు ఉపసంహరించినా.. ఎన్డీఏ కుప్పకూలిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీతో పాటు అటు జనసేనకు కూడా ఎన్డీఏ పెద్దల నుంచి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఏపీపై మరింత ఫోకస్ పెంచి…ఏపీపై పూర్తి అవగాహన పెంచుకుంటే… ఎఫ్పటికైనా అవసరపడుతుందన్న భావనలో అమిత్ షా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తన వద్దకు వస్తున్న టీడీపీ ఎంపీలను ఆయన బాగా చూసుకుంటూ ఉండటంతో పాటుగా వారితో మనసు విప్పి మాట్లాడుతున్నారని చెప్పాలి.

This post was last modified on April 1, 2025 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్…

1 hour ago

జేడీ సతీమణి: పోయింది 2.5 కోట్లు.. దక్కింది 45 లక్షలు!

మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే.…

2 hours ago

జనసేన ఎమ్మెల్యేపై యాక్షన్

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.…

2 hours ago

50 కోట్ల నష్టం నుండి 50 కోట్ల లాభం వరకు!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి ఫలితం అటు ఇటు అయినా, కమ్ బ్యాక్ ఇస్తే…

3 hours ago

‘కూటమిలో ఇబ్బందులు సరే.. అయినా కలిసి ఉండాల్సిందే’

పార్టీ అధినేత ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానిని ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి.…

3 hours ago

రిటైర్మెంట్‌ పై సింగర్ మరింత క్లారిటీ

చాలా తక్కువ సమయంలో దేశంలోనే టాప్ సింగర్లలో ఒకడిగా ఎదిగిన బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్.. కేవలం 38 ఏళ్ల…

3 hours ago