Political News

సరదా సరదాగా!… నవ్వుతూ తుళ్లుతూ!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మోముపై నిత్యం చిరునవ్వు చిందుతూనే ఉంటుంది. ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సగటు మిడిల్ క్లాస్ మనిషిగా ఉండటానికే ఇష్టపడతారు కూడా. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్తులపై విరుచుకుపడుతున్న సమయంలో రేవంత్ ఓ ప్రళయ రుద్రుడి మాదిరే కనిపిస్తారు. ఆ సందర్భాల్లో రేవంత్ నోట నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలతాయి. అయితే ఆ ప్రసంగం ముగిసిన మరుక్షణమే తిరితి రేవంత్ ముఖంపై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది.

సరే.. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆపై టీపీసీసీ చీఫ్ గా, ఆపై ఎకంగా టాప్ పోస్ట్ గా పరిగణించే ముఖ్యమంత్రి హోదాను కూడా అందుకున్న తర్వాత రేవంత్ లో పరిణతి లెవెల్స్ ఓ రేంజిలో పెరిగిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను ఏనాడూ తన శత్రువులుగా భావించని రేవంత్…వారు అనారోగ్యంతోనో, ఇంకేదైనా సమస్యలో ఉంటేనో…వారిని పలకరించి వారికి సాంత్వన చేకూర్చడంలో ఎలాంటి బేషజాలకు పోరనే చెప్పాలి. ఈ కారణంగానే ఆమధ్య కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే… సీఎం హోదాలో ఉండి కూడా నేరుగా ఆసుపత్రికి వెళ్లి మరీ కేసీఆర్ ను పరామర్శించారు.

తాజాగా మంగళవారం రేవంత్ రెడ్డికి చెందిన ఓ వీడియో అమితాసక్తిని రేకెత్తించిందని చెప్పక తప్పదు. తన మంత్రి వర్గంలోని కొందరు మంత్రులతో కలిసి నిలబడి మాట్లాడుతున్న సందర్బంగా అదేదో ప్రాణ స్నేహితుల్లా… కాలేజీమేట్స్ మాదిరిగా వారితో ఆయన నవ్వుతూ, తుళ్తుతూ కనిపించారు. అదేదో కాలేజీలో ఇంటర్వెల్ మధ్యలో సమయం దొరికితే మిత్రుల మద్య ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ఈ వీడియోలో రేవంత్ తన సహచరులతో అలాగే కనిపించారు. ఎంచక్కా మంత్రులతో జోకులేసుకుంటూ మంత్రులు పగలబడి నవ్వితే,.. వారితో కలిసి నవ్వుతూ రేవంత్ కనిపించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల వ్యవహారంపై సమీక్షించేందుకు మంగళవారం ఉదయం రేవంత్ నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చారు. ఆయనతో బేటీ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారితో అక్కడే బయట నిలబడి రేవంత్ మాట్లాడిన సందర్భంగా ఈ సరదా సన్నివేశం కనిపించగా… ఈ భేటీకి వచ్చిన మంత్రి సీతక్క అలా దూరంగా నిలబడి రేవంత్ సరదా సన్నివేశాన్ని చిత్రీకరించారట. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.

This post was last modified on April 1, 2025 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు…

3 hours ago

యాంకర్ అబ్బాయికి భలే మంచి ఛాన్స్

రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…

5 hours ago

ఏప్రిల్ 11 – ఓటిటి అభిమానులకు పండగే

థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…

6 hours ago

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

9 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

9 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

10 hours ago