తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు గానీ… చూస్తుంటే ఇంకా చాలా కసరత్తే జరుగుతున్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఇంకా విస్తరణకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం కాలేదన్న వాదనలకూ బలం చేకూరుతోంది. ప్రస్తుతానికి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ లో ఇంకో ఆరు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఓ నాలుగు స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఆ నలుగురూ వీరేనంటూ ఓ జాబితా సర్కులేట్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించాలని పార్టీ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి ఇప్పుడు అధిష్ఠానానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మొన్నటి ఎన్నికల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారిలో స్పీకర్ గా కొనసాగుతున్న గెడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒకరు. వికారాబాద్ నుంచి ప్రసాద్ కుమార్ గెలిచారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పార్టీ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), మనోహర్ రెడ్డి (తాండూరు), టి.రామ్మోహన్ రెడ్డి (పరిగి) ఉన్నారు. వీరిలో మల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఒకింత గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకుని తీరాల్సిందేనన్న భావనతోనే ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ కేబినెట్ ఇప్పటిదాకా లేనే లేదన్న వాదనను బయటకు తీసుకుని వచ్చారు.
ఈ లెక్కన మల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేస్తే… మనోహర్ రెడ్డి గానీ, రామ్మోహన్ రెడ్డి గానీ మంత్రి పదవి కూడా అడిగే పరిస్థితి లేదనే చెప్పాలి. ఇక గెడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ స్పీకర్ గా ఉన్న నేపథ్యంలో ఆయన అసలు మంత్రి పదవి గురించి అడిగే ప్రసక్తే లేదని చెప్పొచ్చు. వెరసి జానారెడ్డి కూడా మల్ రెడ్డి కోసమే రంగంలోకి దిగినట్లుగా వార్తలు వినిపిస్తగున్నాయి. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి కూడా మంత్రి పదవి కోసం మల్ రెడ్డి చేయని యత్నమంటూ లేదనే చెప్పాలి. అంతేకాకుండా పార్టీకి నమ్మినబంటుగా సాగుతున్న మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు మంచి సందేశం పంపినట్లే అవుతుందన్నది నేతల వాదన.
ఇలా అన్నీ ఆలోచించుకున్న తర్వాతే జానా రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి అంటూ రంగంలోకి దిగారు. ఈ దిశగా ఆయన ఈ నలుగురిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో పాటుగా ఏఐసీపీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లకు ఏకంగా లేఖలే రాశారు. ఇటీవలే పార్టీలో యాక్టివేట్ అయిన జానా మాటకు పార్టీ విలువైతే ఇస్తుంది గానీ… ఇప్పటి కేబినెట్ విస్తరణలో ఆయన మాటకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమ నలుగురిలోఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఈ నలుగురు ఉమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారట.
This post was last modified on April 1, 2025 3:48 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…