వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం. గతవారం ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కడుపు నొప్పి అంటూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన నాని.. ఆ తర్వాత గుండె సంబంధిత రోగాలతో సతమతం అవుతున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. తాజాగా కుటుంబ సభ్యులు ఆయనను సోమవారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం వారు ఓ ప్రత్యేక విమానాన్ని వినియోగించారు. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకున్న నాని కుటుంబం… నానిని అందులో ఎక్కించుకుని…ఆయనతో దాదాపుగా 8 మంది కుటుంబ సభ్యులు ముంబై వెళ్లారు.
హైదరాబాద్ నుంచి సోమవారం స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన నాని… నేరుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరారు. వాస్తవానికి నాని గుండెలో మూడు వాల్వ్ లు మూసుకుపోయాయని ఏఐజీ వైద్యులే నిర్ధారించారు. దీంతో నాని సమస్య స్టెంట్ లతో సరిపెట్టేది కాదని తేల్చిన వైద్యులు.. నానికి బైైపాస్ సర్జరీ తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని తేల్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఏదో ఒక ప్రముఖ ఆసుపత్రిలోనే నానికి బైపాస్ సర్జరీ జరుగుతుందని, అంతటితోనే ఆయన అనారోగ్యం సెట్ అయిపోతుందని అంతా భావించారు. అయితే ఉన్నట్టుంది సోమవారం నానిని ఆయన ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని మరీ ముంబైకి హుటాహుటీన తరలించడం చూస్తుంటే నాని ఆరోగ్యం ఒకింత క్రిటికల్ గానే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ముంబైలో నానికి బైపాస్ సర్జరీ కాకుండా ఓపెన్ హార్ట్ సర్జరీజరగనుందని సమాచారం. ఈ ఆపరేషన్ చేసే వైద్యుడు ఎవరన్న విషయంపై ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లకు బైపాస్ సర్జరీలు చేసిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ పాండా.. నానికి సర్జరీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్ పాండా సేవల కోసమే నానిని ఆయన కుటుంబం ముంబైై తరలించి నట్లగా తెలుస్తోంది. ఓపెన్ హార్ట్ సర్జరీల్లో ఆరితేరిన పాండాతో ఆపరేషన్ చేయిస్తే…ముప్పు ఉండదన్న భావనతోనే నాని కుటుంబం ఆయనను ముంబై తరలించిందని, అందుకోసం ఎంత ఖర్చుకైనా ఆ ఫ్యామిలీ వెనుకాడలేదని సమాచారం. డాక్టర్ పాండా చేతిలో సర్జరీ చేయించుకుని నాని ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
This post was last modified on March 31, 2025 6:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…