Political News

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పబ్లిక్, ప్రవేట్, పీపుల్ పార్టనర్ షిప్ (పీ4) పేరిట నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రారంభించారు. అదే సమయంలో రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ మఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ4 పథకానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి… పేదరికంలో మగ్గుతన్న నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసే దిశగా సంపన్న కుటుంబాలు కృషి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ సంపన్న కుటుంబంపైనా ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగానే సంపన్న కుటుంబాలు ముందుకు రావాల్సి ఉంటుంది. సాయం తీసుకునే కుటుంబాలను బంగారు కుటంబాలుగా పిలిస్తే… సాయం చేసే సంపన్న కుటుంబాలను మార్గదర్శిగా పిలుస్తారు. ఈ పథకంలో మధ్యవర్తిత్వానికే ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రభుత్వం నుంచి పేద కుటుంబాలకు ఎలాంటి సహాయం అందదు.

ఇక తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం విషయానికి వస్తే… రేషన్ కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డుదారులక దొడ్డ బియ్యం ఇస్తన్ననేపథ్యంలో వారు ఆ బియ్యాన్ని తినలేకపోతున్నారని రేవంత్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు.. సంపన్నల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినేలా చేసేందకే ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం తమ ద్వారానే ప్రారంభమవుతున్నా… భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా రద్దు చేయలేని విధంగా దీనిని పకడ్బందీగా అమలు చేసి తీరతామని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on March 31, 2025 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago