తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి సంబరాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.
గతేడాది మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రేవంత్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలు ముగియగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెుయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవలే మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించింది. మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థుల పేపర్ల వాల్యూయేషన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసిన టీజీపీఎస్సీ… ఇప్పటికే ప్రొవిజలన్ మార్క్ లిస్టులను విడుదల చేసింది. వీటిపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది.
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టినట్లుగా ఆ సంస్థ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు విడుదల చేసిన ప్రొవిజనల్ మార్క్ లిస్టులను ఆధారం చేసుకునే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను విడుదల చేశామన్న ఆయన త్వరలోనే కేటరిగీ వారిగా ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకులను సరిచూసుకుని అభ్యంతరాలంటే తెలిపాలని కోరారు. మొత్తంగా సరిగ్గా ఉగాది పర్వదినాన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేయడం ద్వారా రేవంత్ సర్కారు ఉద్యోగార్థులకు పండగ సంబరాలను అంబరాన్నంటేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 30, 2025 12:49 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…