Political News

పవన్ కు లోకేశ్ జత… మొగల్తూరు హైస్కూల్ కు మహార్థశ

మొగల్తూరు… మెగాస్టార్ చిరంజీవి సొంతూరు. ఆ ఊరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబడిపోయింది. సర్కారీ పాఠశాలలకు నిధులు విడుదల కావడమే గొప్ప. అలాంటిది అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించేందుకు నిధులు అంటే అస్సలు ఊహించడానికే వీలు కాదు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ సోదరుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని మొగల్తూరు హైస్కూల్ కు మహార్దశే పట్టింది. తన స్వగ్రామం అభివృద్ధిపై పవన్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొగల్తూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ అభివృద్ధి దిశగా పవన్ బృందం ఆలోచన చేయగా… దానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి దన్నుగా నిలిచారు. అంతే… మొగల్తూరు జడ్పీ పాఠశాల ఆధునీకరణకు ఏకంగా రూ.1.71 కోట్లు మంజూరయ్యయి.

పట్టణాల్లోని మునిసిపల్ పాఠశాలల పరిస్థితి ఓ మోస్తరుగా ఉంటుంటే… గ్రామాల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పాలి. వీటికి ఒక్కసారి భవనాలు నిర్మిస్తే మళ్లీ వాటి వైపు చూసే నాథుడే ఉండడని చెప్పాలి. ఏదో పిల్లల సంఖ్య అనూహ్యంగా పెరిగితే… అదనపు గదుల నిర్మాణం తప్పించి.. ఉన్న భవనాల ఆధునీకరణ అన్న మాటే దాదాపుగా వినిపించదు. ఈ కారణంగానే మొగల్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాల గురించి కూడా ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. ఏదో మెగాస్టార్ చిరంజీవి సొంతూరు అన్న మాటే తప్పించి… మొగల్తూరుకు అంతగా ప్రాధాన్యం కూడా లేదు. ఈ క్రమంలో ఈ ఊరిని అన్ని ఊర్ల మాదిరిగే ఎవరూ పట్టించుకోలేదు.

ఇలాంటి క్రమంలో పవన్ కల్యాణ్ ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎంగా కావడం… అందులోనూ గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన అడిగి మరీ తీసుకోవడం… పల్లె ప్రగతి అంటూ నిత్యం పవన్ జపిస్తూ ఉండటంతో రాష్ట్రంలోని చాలా పల్లెల రూపు రేఖలు ఇప్పటికే మారిపోయాయి. రహదారి అంటే ఏమిటో తెలియని గ్రామాలకు పవన్ పుణ్యమా అని రహదారి సౌకర్యం వచ్చేసింది. ఆ క్రమంలోనే తన సొంతూరుపైనా పవన్ దృష్టి సారించడం, అందులో భాగంగా పవన్ బృందం ఇటీవలే ఆ గ్రామంలో పర్యటించిన జరిగింది. ఈ సందర్భంగా పడుబడిపోయిన గుహలా ఉన్న జడ్పీ హైస్కూల్ ను ఆధునీకరిద్దామని ఆ బృందం నిర్ణయించగా.. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్… దాని అభివృద్ధికి రూ.1.71 నిధులను మంజూరు చేస్తూ పవన్ సంకల్పానికి వెన్నుదన్నుగా నిలిచారు. అటు పవన్ సంకల్పం, ఇటు లోకేశ్ సహకారంతో అతి త్వరలోనే మొగల్తూరు జడ్పీ హైస్కూల్ రూపు రేఖలు సమూలంగా మారిపోనున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on March 30, 2025 10:16 am

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 seconds ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago