కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి ఏపీలోని విపక్షం వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం పార్లమెంటులో అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకమంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని మిథున్ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ విషయంలో మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తి చేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నామని కూడా మిథున్ ప్రకటించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు వ్యక్తం చేస్తున్న భయాందోళనలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
వాస్తవానికి అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా… బీజేపీతో ఎంతమాత్రం మిత్రుత్వం లేని పార్టీ అయినా వైసీపీ అనుకూలంగానే సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని తెలిసినా కూడా నోరెత్తేందుకు వైసీపీ సాహసించలేదనే చెప్పాలి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ నిర్ణయానికే వైసీపీ మద్దతు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకానొక దశలో బీజేపీకి వైసీపీ సాగిలపడిపోయిందని విమర్శలు వచ్చినా కూడా వైసీపీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కొత్తగా టీడీపీ, జనసేన జతకట్టి తనను ఓడించినా కూడా వైసీపీ… బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క అడుగూ వేయలేదనే చెప్పాలి.
అలాంటిది బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ ప్రకటించడం నిజంగానే మరోమారు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఓ వైపు పార్లమెంటులో పార్టీ వైఖరిని మిథున్ రెడ్డి విస్పష్టంగా ప్రకటిస్తే… అంతకు కాస్తంత ముందుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని… మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టానికి సవరణ అంటే రాజ్యాంగంపై దాడేనని ఆయన అభివర్ణించారు. గతంలోనూ ఓ సారి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకమని చెప్పినా… ఇప్పుడు చెప్పినంత గట్టిగా అయితే తన వాదనను వినిపించలేదు. అయితే ఈ దఫా మాత్రం తన వాయిస్ ను గట్టిగానే వినిపించిన వైసీపీ…బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధపడిందా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on March 29, 2025 5:54 pm
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…