రాష్ట్రానికి కీలకమైన సాగు, తాగు నీటిని అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును మరో రెండేళ్లలోనే పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి దానిని సాకారం చేస్తామని కూడా చెప్పారు. ఇది మంచిదే. ఆయన నిర్ణయం, ప్రణాళి కలను కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే.. అలా సాధించేందుకు ఉన్న మార్గాలేంటి? అన్న ది పరిశీలిస్తే.. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అవసరం.
కానీ, కేంద్రం నుంచి అలాంటి పూర్తి మద్దతు లభిస్తుందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం రెండు విషయాలను కేంద్రం రాష్ట్రానికి వదిలేసింది. 1) నిర్వాసితులకు ఇచ్చే పరిహారం. 2) పునరావాసం. ఈ రెండు విషయాలను కూడా.. కేంద్రం చేయలేమని చెప్పింది. వాస్తవానికి ఈ రెండు విషయాలే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో 6 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పింది.
కానీ.. ఈనిధులను బడ్జట్‌లో ప్రకటించలేదు. దీంతో పునరావాసానికి తొలిదశలో చేసే సాయంపై ప్రకటనలే మిగులుతున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఆలస్యమైనందున 12 శాతం వడ్డీతో కలిపి తమకు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్వాసితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా పరిష్కారం లభించలేదు. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం రెండు రకాల వ్యూహాలు అనుసరిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు పోలవరంపై అభ్యంతరం తెలిపాయి.
తెలంగాణ ప్రభుత్వం.. పోలవరంలోని విలీన మండలాలను తమకు ఇచ్చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇది బీఆర్ ఎస్ హయాంలోనే వేసిన పిటిషన్. దీనిపైకేంద్రం ఇప్పటికీఅఫిడవిట్ వేయలేదు. పైగా.. విచారణ కూడా ప్రారంభం కాలేదు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం ముంపు ప్రాంతాల అంశాన్ని, ఛత్తీస్‌గఢ్ కూడా.. తమ ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు సమస్యలు తెరమీదక నిపిస్తున్న ప్రధాన అంశాలు.
వీటిపై కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సి ఉంది. ఇదే విషయాన్ని గతంలో వైసీపీ సర్కారు కూడా ప్రస్తావించింది. కానీ.. పరిష్కారం కాలేదు. ఇప్పడు కూడా అదే సమస్య వెంటాడుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. పోలవరం పూర్తవడం మంచిదే అయినా.. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా.. అడుగులు ముందుకు పడడం అనేది సాధ్యమేనా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on March 29, 2025 5:16 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…