తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై అసెంబ్లీలో కూలంకష చర్చలు జరిగాయి. పలు జాతీయ అంశాలపైనా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల మద్య మాటల తూటాలు పేలాయి. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ దిశగానూ వాగ్వాదాలూ చోటుచేసుకున్నాయి. ఇన్నేసి చర్చలు, పోట్లాటలు జరిగినా…తమను ఎన్నుకున్న ప్రజల సమస్యల కోసం ఆయా పార్టీ సభ్యులు యత్నిస్తే… వారి యత్నాలను పార్టీలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ కూడా స్వాగతించింది. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్న మాట ఒకింత గట్టిగానే వినిపిస్తోంది.
దేశ రాజకీయాల్లో ఆది నుంచి కమ్మూనిస్టులు, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఈ రాజకీయ వైరుధ్యాన్ని పక్కనపెట్టేసిన సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుతో బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వరరెడ్డి ముచ్చట్లలో మునిగిపోయారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నిత్యం అటు బయటా, ఇటు సభ లోపలా మాటల యుద్దం జరుగుతున్నా… తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పార్టీని, పార్టీతో పాటు వచ్చిన వైరధ్యాన్ని పక్కనపెట్టేసిన బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ నేరుగా మంత్రి సీతక్క పక్కకెళ్లి మరీ కూర్చుని తన సమస్యలను ఏకరువు పెట్టారు. తన వద్దకు వచ్చిన శంకర్ పార్టీని చూడని సీతక్క కూడా… శంకర్ చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటూ… వాటిని పరిశీలిస్తూ కనిపించారు.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యల మధ్య ఈ సమావేశాల్లో ఏ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ హరీశ్, కేటీఆర్ వర్సెస్ మంత్రులు.. ఇలా ఇరు పార్టీల మధ్య ఆయా అంశాలపై ఓ రేంజిలో మాటల యద్ధం జరిగింది. చివరి రోజు సమావేశాల్లో రేవంత్, కేటీఆర్ ల మధ్య సాగిన వాదోపవాదాలు బిగ్ ఫైట్ ను తలపించాయి. అయితే ఇవేవీ తమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి అడ్డు రాకూడదన్న భావనతో బీఆర్ఎస్, అందుకు తాము కూడా రెడీనేనని కాంగ్రెస్ ముందుకు సాగడంతో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.
సీతక్కతో పల్లా రాజేశ్వరరెడ్డి కలిసి కూర్చుని మాట్లాడితే.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ తుళ్లుతూ హుషారుగా కనిపించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీఆర్ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో గంగుల కమలాకర్ కనిపించారు. ఇక హరీశ్ రావు అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబతోనూ కలిసి చర్చలు జరుపుతూ కనిపించారు. ఈ భేటీల్లో ఆయా నేతల మధ్య ఎలాంటి భేషజాలు గానీ..వీరెందుకు తన వద్దకు వచ్చారని మంత్రులు గానీ, వీరి వద్దకు రావాల్సివచ్చిందన్న భావన ఆయా పార్టీల సభ్యులకు గానీ అనిపించిన దాఖలానే కనిపించలేదు.
This post was last modified on March 28, 2025 8:15 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…