పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి ఇతోదిక సహకారం కూడా లబిస్తోంది. అయినా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు అదికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును 2007 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీకే అధికారం దక్కి ఉండి ఉంటే… 2020లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు నిష్క్రియాపరత్వం కారణంగాను 2025 వచ్చినా ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాము అదికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో పలు రకాల చర్యలతో పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిలో పెట్టామని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతాయన్నారు. కేంద్రం నుంచి కూడా ఆశించిన మేర సహకారం లబిస్తోందని ఆయన చెప్పారు. నిర్వాసితులకు ఇఫ్పటికే పరిహారం పంపిణీ చేశామన్నారు. వైసీపీ హయాంలో పరిహారంపై మాట మాత్రంగా చెప్పారని… అయితే పరిహారం మాత్రం పంపిణీ కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్నింటా నిబద్ధతతో వ్యవహరించింది తామేనని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా చంద్రబాబు ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమకు పరిహారం అందిన విషయాన్ని నిర్వాసితులు చంద్రబాబుకు తెలియజేశారు. పునరావాస కాలనీల్లోనూ అన్ని ఏర్నాట్లు అద్భుతంగా ఉన్నాయని వారు సంతోషం వెలిబుచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే పోలవరం నిర్వాసితులకు టీడీపీ ప్రభుత్వం రూ.4,311 కోట్ల పరిహారాన్ని అందించింది. తాజాగా ఇటీవలే ఒకే ఒక్క రోజులో పోలవరం నిర్వాసితులకు రూ.830 కోట్లను వారి ఖాతాల్లో వేసింది. ఇవే విషయాలను ప్రస్తావించిన చంద్రబాబు… మిగిలిపోయిన పరిహారం నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. పరిహారం పూర్తి అయ్యాకే ప్రాజెక్టును ప్రారంభిస్తానని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on March 27, 2025 9:43 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…