ఏపీలో గురువారం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా… తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే…ఈ ఎంపీపీ గతంలో వైసీపీకి దక్కగా… దానిని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పాలి. మెజారిటీ వైసీపీకే ఉండగా..ఎక్కడ ఎంపీటీసీలు జారీపోతారోనని. వారందరినీ ఏకంగా ముంబై, గోవాలకు తరలించి క్యాంపు నిర్వహిస్తోంది. వెరసి ఈ ఎంపీపీ ఎన్నిక రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా చెప్పుకోవాలి.
వైసీపీ అధికారంలో ఉండగా… 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా… చంద్రగిరి నుంచి మోహత్ రెడ్డి పోటీ చేశారు. ఈ కారణంగా తిరుపతి రూరల్ ఎంపీపీ పదవికి మోహిత్ రాజీనామా చేశారు. ఫలితంగా ఖాళీగా ఉన్న ఈ ఎంపీపీ పదవిని భర్తీ చేసేందుకు గురువారం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా దక్కించుకోవాలని కూటమి యత్నిస్తున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది.
ఎంపీపీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగానే.. వైసీపీ ఎంపీపీలను చెవిరెడ్డి వర్గం క్యాంపునకు తరలించింది. తిరుపతి రూరల్ లో వైసీపీకి 33 మంది ఎంపీటీసీలు ఉండగా.. వారిలో నమ్మకంగా ఉంటారన్న ఓ నలుగురు, ఐదుగురిని వదిలేసిన చెవిరెడ్డి.. మొత్తం 27 ఎంపీటీసీలను క్యాంపునకు తరలించింది. వీరిలో కొందరిని ముంబై తరలించగా… మరికొందరిని గోవా తరలించింది. వీరిలో కొందరు ఎంపీటీసీలు ఫ్యామిలీతో కలిసి క్యాంపునకు తరలివెళ్లారు. ఈ ఖర్చులన్నీ తడిసిమోపెడు అయినట్లుగా సమాచారం, ఇక ఎంపీపీ ఎన్నికకు సమయం దగ్గరపడగా.. గురువారం ఉదయం వారందరినీ విమానాల్లో తిరుపతి తరలించారు.
This post was last modified on March 27, 2025 11:21 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…