తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు అధికార పక్షం నుంచి కూడా రీ కౌంటర్లు పడిపోతున్నాయి. చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అది కూడా భాషా సంబంధిత అంశం కావడం గమనార్హం. మంత్రి సీతక్క, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య ఓ మోస్తరు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్.. ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి.
మజ్లిస్ పార్టీ హైదరాబాదులోని పాతబస్తీ కేంద్రంగా రాజకీయం చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా…హైదరాబాద్ లోక్ సభ సీటుతో పాటుగా దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ తో పాటు అక్బరుద్దీన్ లు ఉన్నత విద్యావంతులు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లలో వారు అనర్గళంగా మాట్లాడతారు. ఏ అంశంపై అయినా వారు ఈ మూడు బాషల్లో మాట్లాడుతుంటే… ఇట్టే చెవులు అప్పగించి మరీ వినాలనిపిస్తుంది. అలాంటిది ఆ ఇద్దరు నేతలతో పాటుగా మజ్లిస్ కు చెందిన చాలా మంది నేతలకు తెలుగు రాదు. ఈ విషయంలో అసదుద్దీన్ ఒకింత ఫరవా లేదనిపించినా… అక్బరుద్దీన్ మాత్రం తెలుగు అస్సలు మాట్లాడలేరు. తెలుగును అర్థం చేసుకోనూ లేరు.
ఇక బుధవారం నాటి ఘటన విషయానికి వస్తే…ప్రభుత్వ పథకాల గురించి అక్బరుద్దీన్ పలు అంశాలను లేవనెత్తారు. ఈ సందర్బంగా ఆయన ప్రశ్నలకు మంత్రి సీతక్క నుంచి అంతగా సరైన సమాధానం రాలేదే, ఏమో తెలియదు గానీ… సీతక్క తీరును అక్బర్ నిరసించారు. తాను ఒకటి అడిగితే..మంత్రిగారు ఇంకొకటి చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన ”సీతక్కకు ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు”అంటూ వ్యాఖ్యానిచారు. ఈ వ్యాఖ్యలకు సీతక్క కూడా స్పాంటేనియస్ గా స్పందించారు. తనకు ఇంగ్లీష్ రాదని, ఉర్దూ కూడా రాదని తేల్చి చెప్పారు. ఎక్కడో అడవుల్లో, గూడేంలో పుట్టి పెరిగిన తనకు తెలుగు మాత్రమే వచ్చునని ఆమె తెలిపారు. అయినంత మాత్రాన ఆయా విషయాలు తనకు తెలియవా? అంటూ ఆమె అక్బర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ సంభాషణలను విన్న నెటిజన్లు… అక్బర్ కు తెలుగు రాని విషయాన్ని ఒకింత లైటర్ వేలో ప్రశ్నించారు.
This post was last modified on March 26, 2025 9:52 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…