గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ఇక ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటపడే అవకాశాలే లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులోనే అరెస్టు అయిన వంశీ. ఇకపై గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో పీలకల్లోతు కూరుకుపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహన రంగా అరెస్టు కావడమేనని చెప్పక తప్పదు. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో మోహన రంగా ఏ1గా ఉన్నారు. రంగాను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవంగా గన్నవరం టీడీపీ కార్యాలయం ద్వంసం కేసులో వంశీ నిందితుల జాబితాలో ఎక్కడో చివర ఉన్నారు. అంతే కాకుండా ఈ కేసు నమోదు అయినప్పుడు వంశీ అసలు నిందితుల జాబితాలోనే లేరు. ఆ తర్వాత ఆయన ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఆయన పేరును చేర్చారు. ఈ కేేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో వంశీ… కేసునే కొట్టివేయించే దిశగా అడుగులు వేశారు. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను అపహరించి.. బెదిరించి, డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి కేసు వాపస్ తీసుకునేలా ఒప్పించారు. అయితే ఈ విషయం బయటపడటంతో సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపల కేసులోనే వంశీ అరెస్టు ఆయ్యారు.
ఓ వైపు ఈ కిడ్నాప్ కేసును అలా నడిపిస్తూనే పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును బిగించే దిశగా వ్యూహాత్మకంగా సాగారు. కిడ్నాప్ కేసులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సాగుతున్న పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితులను వరుసబెట్టి అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రధాన నిందితుడు మోహన రంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగానే కాకుండా వంశీ కుడి భుజంగానూ వ్యవహరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ లెక్కన మోహన రంగా అరెస్టుతో వంశీకి చెందిన దాదాపుగా అన్ని వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారం తమకు లభించినట్టేనని పోలీసులు భావిస్తున్నారు.
ఇక టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు కేంద్రంగాన వంశీ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ అదే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఓ రేంజిలో ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారుకు మెయిన్ టార్గెట్ గా మారిపోగా… ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక నిందితుడు అరెస్టు కావడం వంశీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలన్న వంశీ పిటిషన్ పై వాదనలు ముగియగా… తీర్పు వాయిదా పడింది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పై బుధవారం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మోహన రంగా అరెస్టుతో వంశీకి కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా… టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాత్రం బెయిల్ రావడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 26, 2025 1:03 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…