Political News

బాబూ.. ‘క‌న్ను’ క‌ప్పేస్తున్నారు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సొంత నేత‌లే క‌న్ను క‌ప్పేస్తున్నారు. గ‌తంలో వైసీపీ నాయ‌కులు అక్ర‌మాలు చేశార‌ని.. అన్యాయాలు చేశార‌ని.. ప‌దే ప‌దే చెప్పిన వారు.. ఇప్పుడు అదే బాట‌లో న‌డుస్తున్నారు. పైకి స‌చ్ఛీలురుగా.. సైకిల్ ఎక్కుతున్నామ‌నిచెబుతున్న నాయ‌కులే.. అడ్డంగా ప్ర‌జ‌ల‌ను దోచేస్తున్నారు. ఇదే దో విప‌క్ష నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌కాదు..అత్యంత‌ అనుకూల మీడియా నిప్పులు చెరుగుతున్నంత వాస్త వాలు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు!

జిల్లాను బ‌ట్టి దందాలు మారుతున్నాయి. ఉమ్మ‌డి తూర్పులో భూ క‌బ్జాలు నిత్యంకృత్యం అయ్యాయి. గ‌జం క‌నిపిస్తే.. గున‌పం దిగాల్సిందే.. త‌మ్ముడు అడుగు పెట్టాల్సిందే అన్న‌ట్టుగా తూర్పులో భూ ప‌ర్వం సాగు తోంది. ఇది బ‌య‌ట‌కు రాకుండా.. పొరుగు పార్టీల‌కు చెందిన వారిని సైతం.. మ‌చ్చిక చేసుకుని మ‌రిపిస్తు న్నారు. కుదిరితే వాటా.. లేకపోతే సంచుల‌తో స‌రిపుచ్చుతున్నారు. దీంతో జిల్లాలో య‌థేచ్ఛ‌గా భూమాఫి యా దూకుడు సాగిపోతోంది. అంతిమంగాఇది చంద్ర‌బాబుకే చెడ్డ పేరు తెస్తోంది.

ఇక‌, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మద్యం మాఫియా ఏరులు పారిస్తోంది. వైన్స్‌లో తెచ్చిన మ‌ద్యాన్ని బార్ల‌లో 24 గంట‌ల‌పాటూ విక్ర‌స్తున్నారు. నిబంధ‌న‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా లేదు. పైగా.. మామూళ్ల వ‌ర‌ద‌లో పోలీసులు జోగుతున్నారు. అంతేకాదు.. ప‌లు జిల్లాల్లో పోలీసులు పంచాయ‌తీ లు చేసేస్తున్నారు. గ‌తంలో పోలీసుల‌కు ఒకింత భ‌యం ఉండేది. వైసీపీ పాల‌న‌లో పోలీసుల‌పై తేడా వ‌స్తే.. కేసులు పెట్టి జైళ్ల‌లోకి నెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి.

కానీ..ఇప్పుడు చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నారు. దీంతో పోలీసులు.. స్టేష‌న్ల‌నే అడ్డాగా మార్చేసుకుంటు న్నారు. ప‌శ్చిమ గోదావ‌రిలో పేకాట శిబిరాలకు పోలీసులు అన‌ధికార ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు.. టీడీపీలోని ఓ వ‌ర్గం నాయ‌కుల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అనంత‌పురం, క‌ర్నూలులోనూ ఇదే తంతు క‌నిపిస్తోంది. కొన్ని చోట్ల ఇసుక‌, మ‌రికొన్ని చోట్ల మ‌ద్యం.. ఇలా అయిన‌కాడికి చంద్ర‌బాబు క‌న్ను క‌ప్పి.. త‌మ్ముళ్లు వీరంగం వేసేస్తున్నారు. అయితే.. ఇవి ఇప్ప‌టికిప్పుడు ఎఫెక్ట్ చూపించ‌క‌పోయినా.. స‌ర్కారుపై మాత్రం మ‌ర‌క‌లు ప‌డేలా చేస్తోంది.

This post was last modified on March 26, 2025 10:58 am

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

1 hour ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

4 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

4 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

6 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago