దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన సదరు పత్రాలను అమిత్ షా కూడా కూలంకషంగా పరిశీలిస్తూ కనిపించారు. ఈ ఫొటో బయటకు వచ్చినంతనే ఏపీలో పెద్ద చర్చకే తెర లేసింది.
వాస్తవానికి రాయలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీలో నెంబర్ 2గా కొనసాగుతున్న అమిత్ షాతో రాయలు భేటీకి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్డీఏలో రథసారథి స్థానంలో బీజేపీ కొనసాగుతుంటే… బీజేపీ తర్వాత అత్యదిక ఎంపీ స్థానాలను కలిగి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతోంది. ఈ లెక్కన ఏదో ఎన్డీఏ వ్యవహారం గురించో వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చునని, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎన్డీఏ వ్యూహాలపై సమాలోచనలు చేసేందుకు వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ అవేవీ చర్చకు రావడం లేదు.
సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో కూడా డిల్లీ తరహాలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిన తరహాలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, అందులో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ముడుపులను విదేశాలు పంపారని రాయలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలు కోరినట్లు ఈడీ రంగంలోకి దిగితే ఇక తమ పని అయిపోయినట్టేనని వైసీపీ కీలక నేతలు భయాందోళనలకు గురయ్యారన్న విశ్లషణలు వినిపించాయి.
ఈ విశ్లేషణలు సాగుతున్న క్రమంలోనే…మద్యం కుంభకోణంపై రాయలు పార్లమెంటులో ప్రస్తావించిన మరునాడే.. నేరుగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో వైైసీపీ శిబిరంలో వణుకు మొదలైందని చెప్పాలి. అమిత్ షాతో రాయలు బేటీకి సంబంధించిన వార్తలు విన్నంతనే… ఇక జగన్ పని అయిపోయినట్టేనన్న విశ్లేషణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను రాయలు ఇస్తూ ఉంటే… అమిత్ షా వాటిని లోతుగా పరిశీలిస్తున్నారంటూ వారిద్దరి భేటీ దృశ్యాలను చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ రాయలు వైసీపీ శిబిరంలో వణుకు పుట్టించారన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.
This post was last modified on March 26, 2025 10:41 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…