Political News

ఇలాగైతే… 20 లక్షల కొలువులు ఓ లెక్కా?

ఏపీలోని కూటమి సర్కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. సర్కారీ ఖజానాను గత ప్రభుత్వ పెద్దలు ఖాళీ చేయడంతో పాటుగా కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లినా…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కూటమి సర్కారు అద్భుతాలనే చేసి చూపిస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే ఏపీకి రూ.8 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులను ఆకర్షించిన కూటమి… వాటి ద్వారా ఏకంగా 6 లక్షల మేర ఉద్యోగాల కల్పనకు రూట్ మ్యాప్ సిఃద్దం చేసింది. తాజాగా 50 వేల ఉద్యోగాలకు మార్గం సుగమం చేసే ఓ కీలక ఒప్పందంపై ఏపీ సర్కారు సంతకం చేసింది. ఈ లెక్కన కూటమి నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నది సర్కారుకు పెద్ద లక్ష్యమేమీ కాదని చెప్పాలి.

అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సిస్కోతో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ యువతకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇతర అడ్వాన్స్ డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే దిశగా కీలక చర్చలు జరిగాయి. దాదాపుగా నిర్దేశిత పరిధిలో 50 వేల మందికి డిజిటల్, అడ్వాన్స్ డ్ ఐటీలో శిక్షణ ఇచ్చేందుకు సిస్కో సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీగా కొనసాగుతున్న సిస్కోలో శిక్షణ అంటే.. దాని ప్రమాణాలు కూడా అంతే స్థాయిలోనే ఉంటాయని చెప్పక తప్పదు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సిస్కోలోనో, లేదంటే ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఖాయంగా దక్కుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంటే… సిస్కో కంపెనీతో ఒప్పందం ద్వారానే 50 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది కూటమి సర్కారు అక్ష్యం అయిన 20 లక్షల ఉద్యోగాల్లో 5 శాతం అన్న మాట. ఇక ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన పెట్టుబడుల ద్వారా మరో 6 లక్షల దాకా ఉద్యోగులు దాదాపుగా వచ్చేసినట్టే కదా. ఈ లెక్కన మొత్తంగా 35 శాతం దాకా లక్షాన్ని చేరినట్టే. ఏడాది తిరక్కుండానే 35 శాతం మేర లక్ష్యాన్ని సాదిస్తే.. ఇక నాలుగేళ్లలో మిగిలిన 65 శాతం లక్ష్యాన్ని కూటమి సర్కారు చేరుకోలేదా? అంటే… అదేమంత పెద్ద సమస్యే కాదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా లోకేశ్ ఇదే స్పీడును కొనసాగిస్తే… ఈ లక్ష్యం ఏం ఖర్మ… దానికి రెట్టింపు స్థాయిలో ఫలితాలు రావడం ఖాయమని చెప్పక తప్పదు.

This post was last modified on March 25, 2025 9:38 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

43 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago