బీహార్ అసెంబ్లీకి బుధవారం ముగిసిన మొదటివిడత పోలింగ్ లో యూపీఏనే పై చెయ్యి సాధించినట్లు పరిశీలకలు అంచనాలు కడుతున్నారు. తొలిదశలో భాగంగా 54.21 శాతం పోలింగ్ లో 71 శాతానికి ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ మీడియా, సర్వే సంస్ధలు అనేక మార్గాల్లో ఓటర్లనాడిని రాబట్టే ప్రయత్నం చేశాయి. దీని ప్రకారమైతే యూపీఏకి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు లెక్కలు కట్టాయి.
యూపీఏ కూటమిగా పోటీచేసిన ఆర్జేడీ 19 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయట. అలాగే కాంగ్రెస్ 6 స్ధానాలు, సీపీఐ(ఎంఎల్) 5 సీట్లలో గెలుస్తాయని అంచనాలకు వచ్చాయి. ఈ లెక్క ప్రకారం 30 సీట్లలో ఆధిక్యత వచ్చే అవకాశాలున్నాయట. ఇదే సందర్భంలో ఎన్డీఏ కూటమికి 19 స్ధానాల్లో ఆధిక్యత దక్కే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలను బట్టి అంచనాలు వేశాయి.
ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 11 సీట్లు, జేడీయూకి 7, హెచ్ఏఎం పార్టీకి ఒక్క సీటు దక్కే అవకాశం ఉన్నట్లు లెక్కలు కట్టారు. అంటే మొత్తం 19 సీట్లలో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని తేలింది. మిగిలిన 22 సీట్లలో గెలుపు ఎవరిదో చెప్పటం కష్టమని సర్వేలు తేల్చేశాయి. ఎందుకంటే ఈ 22 నియోజకవర్గాల్లో ఫైట్ చాలా టైట్ గా జరిగిందట. కాబట్టి ఓటర్ల మొగ్గు కూడా ఎవరివైపుందో సర్వే సంస్ధలు కూడా స్పష్టంగా తేల్చలేకపోయాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆధిక్యత కోసం ఎన్డీఏ కూటమి, అధికారం కోసం ఆర్జేడీ చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాయి. వీళ్ళని పక్కనపెట్టేస్తే మరో రెండు కూటములతో పాటు ఎల్జేపీ+ఎన్సీపీ+శివసేన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. ఎన్డీయే, ఆర్జేడీ కూటముల మధ్యే గెలుపోటములు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ గెలుపోటములు కూడా మరో రెండు కూటముల్లోని పార్టీలు, మూడు పార్టీల పైనే ఆధారపడుందన్నది వాస్తవం.
ఎలాగంటే రెండు కూటములు, మూడు పార్టీల అభ్యర్ధులు గెలిచే అవకాశాలు దాదాపు లేనట్లే అని ఇప్పటికే తేలిపోయింది. కాకపోతే వీళ్ళలో అత్యధికులు గెలవలేకపోయినా గెలుపు అవకాశాలున్న అభ్యర్ధులను దెబ్బతీసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. గెలుపుకోపం ఎన్డీయే, ఆర్జేడీ కూటమిలోని అభ్యర్ధులు గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో మిగిలిన అభ్యర్ధులకు పడే ఓట్లపైనే రెండు కూటముల అభ్యర్ధుల గెలుపోటములు ఆధారపడుంటాయి. మొత్తం మీద మొదటిదశ పోలింగ్ తర్వాత మిగిలిన రెండు దశల పోలింగ్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
This post was last modified on October 29, 2020 3:39 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…