Political News

పుల్లారావుదే పైచేయి.. పేట రాజ‌కీయం అద‌ర‌హో ..!

రాత్రికి రాత్రి ఫోన్లు మోగాయి.. ఉద‌యానిక‌ల్లా.. చిల‌క‌లూరిపేట‌లోని టీడీపీ కార్యాల‌యం సండ‌దిగా మారి పోయింది. ప‌ల్నాడు జిల్లాలోని ప‌లు మండ‌లాల‌కు చెందిన వారు.. టీడీపీ ఆఫీస్‌ను వెతుక్కుంటూ వ‌చ్చేశారు. మ‌రికాసేప‌టికి వారిని వెతుక్కుంటూ.. మీడియా చానెళ్లు పోగుప‌డ్డాయి. క‌ట్ చేస్తే.. వారంతా మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కురాలు విడ‌ద‌ల ర‌జనీ బాధితులు! అస‌లే.. ఆమెపై స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మాని చేసిన ఫిర్యాదుతో కేసు న‌మోదై ఉన్న త‌రుణంలో గోరుచుట్టుమీద రోక‌లి పోటు అన్న‌ట్టుగా.. ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు చేసిన రాజ‌కీయం స‌క్సెస్ అయింది.

ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రిపైనా జాలి ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. రాజకీయం అంటే అంతే! ప్ర‌త్య‌ర్థుల తీరు ఇంతే!! అన్న‌ట్టుగా పేట రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌తంలో పుల్లారావు కుమారుడిపై జీఎస్టీ అధికారులు కేసు న‌మోదు చేసిన‌ప్పుడు.. వైసీపీ నాయ‌కులు కూడా ఇలానే చేశారన్న వాద‌న ఉంది. కాబ‌ట్టి.. ఇప్పుడు త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై పుల్లారావు ఇలా చేయ‌డంలో త‌ప్పేలేదు! అనే టాక్ వినిపించింది. ఇక‌, తాజాగా టీడీపీ ఆఫీసుకు వ‌చ్చిన వారంతా గ‌తంలో ర‌జ‌నీకి సొమ్ము ఇచ్చిన వారే!

చాలా మంది నుంచి రూ.ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌ల్లోనే ర‌జ‌నీ సొమ్ములు తీసుకున్నార‌న్న‌ది బాధితులు చెప్పిన క‌థ‌నాల‌ను బట్టి తెలుస్తోంది. ఇంటికో పువ్వు.. అన్న‌ట్టుగా ర‌జ‌నీ ప‌రివారం అందిన కాడికి ఆబ‌గా తీనేశార‌న్న‌ది బాధితులు చెప్పిన మాట‌. ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క గాధ‌, బాధ‌! మొత్తంగా కీల‌క‌మైన కేసు న‌డుస్తున్న స‌మ‌యంలో ర‌జ‌నీని మ‌రింత డైల్యూట్ చేయ‌డంలోనూ.. మ‌రింత‌గా ఆమెను ఇరుకున పెట్ట‌డంలోనూ.. మాజీ మంత్రి పుల్లారావు వేసిన స్కెచ్ అద్భుత‌: అనే రేంజ్‌లో ఉందని పార్టీ నేత‌లు మురిసిపోయారు.

ఇక‌, ర‌జ‌నీ విష‌యానికి వ‌స్తే.. న‌లువైపుల నుంచి చుట్టుముట్టిన వివాదంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక్క స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మాని నుంచే కాకుండా.. సామాన్యుల నుంచి పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచికూడా ఆమె సొమ్ములు వ‌సూలు చేశార‌ని బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఎవ‌రూ ఆమెపై సానుభూతి చూపించే ప‌రిస్థితి లేకుండా పోయింది. స‌హ‌జంగా బీసీ మ‌హిళ అనే సానుభూతి రాజ‌కీయాల్లో ఉంటుంది. కానీ, ఈ సానుభూతి పెరుగుతుంద‌న్న లెక్క‌లు వేసుకున్న పుల్లారావు.. ఎక్క‌డా లేటు కాకుండా.. సానుభూతిపై వేటేసేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 25, 2025 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోమటిరెడ్డి ఫ్యామిలీకి డబుల్ ధమాకా

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను పరిపూర్ణం చేసుకునే దిశగా చేసిన యత్నాలు ఎట్టకేలకు ఫలించాయనే…

1 hour ago

హాట్ టాపిక్ : మీడియం సినిమాలకు టికెట్ హైక్

ప్యాన్ ఇండియా సినిమాలకు బడ్జెట్ పెరిగినప్పుడు దాన్ని థియేటర్ రెవెన్యూ ద్వారా రికవర్ చేసుకోవాలంటే టికెట్లు రేట్లు కొంత సమయం…

2 hours ago

నేత‌ల కొర‌త తీర్చేలా.. జన‌సేన అడుగులు ..!

జ‌న‌సేన‌లో నాయ‌కుల కొర‌త తీవ్రంగానే ఉంది. పైకి క‌నిపిస్తున్న వారంతా ప‌నిచేయ‌డానికి త‌క్కువ‌.. వివాదాలు సృష్టించేందుకు ఎక్కువ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.…

2 hours ago

‘వర్గీకరణ’తోనే డీఎస్సీ… ఏప్రిల్ తొలివారంలో నోటిఫికేషన్

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా…

2 hours ago

ద‌టీజ్ కోటంరెడ్డి ..!

ఆయ‌న పార్టీ మారారు. కానీ, పంథా మాత్రం మార్చుకోలేదు. ఆయ‌నే నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. ఆయ‌న…

2 hours ago

రెడ్ లారీ ఫెస్టివల్స్ మరెన్నో జరగాలి

ఇప్పుడేదో రీ రిలీజుల పేరుతో స్టార్ హీరోల మాస్ సినిమాలను చూసి, అల్లరి చేసి మురిసిపోతున్నాం కానీ నిజమైన క్లాసిక్స్…

3 hours ago