ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ ఉత్సాహపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఓ కీలక నేరానికి సంబంధించిన కేసు నమోదు అయిపోయింది. జిల్లాలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగానే కాకుండా ఇష్టారాజ్యంగా దోచేసిన కేసులో ఓ ఆరుగురితో పాటుగా కాకాణి పేరు కూడా చేరిపోయింది. ఈ మేరకు నెల్లూరు పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉండగా… వారిలో కాకాణి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఏ6, ఏ7 నిందితులను సోమవారం అరెస్ట్ చేయగా…గూడూరు కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
వాస్తవానికి ఈ కేసులో ఇదివరకే కాకాణికి చెందిన ముగ్గురు ప్రధాన అనుచరులపై కేసు నమోదు కాగా… ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకున్న ఆ ముగ్గురు క్షణాల్లో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో తాజాగా మరో ఏడుగురు నిందితులను చేరుస్తూ సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని పొదలకూరు మండల పరిదిలో రుస్తుం మైన్స్ పేరిట దాదాపుగా రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేశారన్నది ఈ కేసు ప్రధాన ఆరోపణ. దీనిపై నమోదు అయిన కేసులో నిందితులంతా కాకాణి ప్రధాన అనుచరులే. తాజాగా కాకాణి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారంటేనే… ఆయన పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి..
ఈ కేసు తీవ్రత చూస్తుంటే…కాకాణి అరెస్టు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే కాకాణి కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెెచ్చుకోక తప్పదన్న విశ్లేషణలూ లేకపోలేదు. అయితే కాకాణి కోర్టును ఆశ్రయిస్తారా?..కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లబిస్తుందా? అన్న దానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…ఇదివరకే నమోదు అయిన ఈ కేసులో ఇప్పుడు కాకాణి పేరును చేర్చారంటేనే ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికి ఉంటేనే… పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకుని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు నుంచి కాకాణి ఎలా తప్పించుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
This post was last modified on March 25, 2025 10:40 am
ప్యాన్ ఇండియా సినిమాలకు బడ్జెట్ పెరిగినప్పుడు దాన్ని థియేటర్ రెవెన్యూ ద్వారా రికవర్ చేసుకోవాలంటే టికెట్లు రేట్లు కొంత సమయం…
జనసేనలో నాయకుల కొరత తీవ్రంగానే ఉంది. పైకి కనిపిస్తున్న వారంతా పనిచేయడానికి తక్కువ.. వివాదాలు సృష్టించేందుకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.…
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా…
ఆయన పార్టీ మారారు. కానీ, పంథా మాత్రం మార్చుకోలేదు. ఆయనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఆయన…
ఇప్పుడేదో రీ రిలీజుల పేరుతో స్టార్ హీరోల మాస్ సినిమాలను చూసి, అల్లరి చేసి మురిసిపోతున్నాం కానీ నిజమైన క్లాసిక్స్…
సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వ సాధారణం. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవడం లేదు. కొందరు పోటీ వల్ల అక్కసుతో, మరికొందరు…