Political News

పులివెందుల రైతుకు క‌ష్టం.. జ‌గ‌న్ క‌న్నా ముందే స‌ర్కారు స్పంద‌న‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పులివెందుల‌లో రైతుల‌కు భారీ క‌ష్టం వ‌చ్చింది. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌రకు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన బీభ‌త్సం సృష్టించింది. దీంతో అర‌టి, చీనీ(బ‌త్తాయి) తోట‌లు వేలాది ఎక‌రాల్లో నేల‌మ‌ట్టం అయ్యాయి. ఇలాంటి స‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యేగా జ‌గ‌న్ స్పందించాల్సి ఉంది. రైతుల క‌ష్టాలు తెలుసుకుని స‌ర్కారు ద్వారా వారికి సాయం అందించాల్సి ఉంటుంది.

కానీ, జ‌గ‌న్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం దాకా స్పందించ‌లేదు. అస‌లు పులివెందుల‌లో ఏం జ‌రిగింద‌న్న విషయంపైనా ఆయ‌న ఆరా తీయ‌లేక పోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న సొంత ప‌నిపై ఉన్న‌ట్టు తెలిసింది. కానీ, ఈ స‌మ‌యంలో త‌మ ప్ర‌త్య‌ర్థి నాయ‌కుడి సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. త‌మ‌కు ఇక్క‌డ ఒక్క‌సారి కూడా గెలుపు ద‌క్క‌లేద‌ని తెలిసినా.. టీడీపీ నాయ‌కులు స్పందించారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం హుటాహుటిన స్పందించింది. పులివెందుల‌లో ఏం జ‌రిగిందో తెలుసుకుని త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని క‌డ‌ప క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది.

మ‌రీ ముఖ్యంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిలు.. స్థానిక రైతాంగం విష‌యాల‌పై ఆరా తీశారు. నేరుగా భూమిరెడ్డిని క్షేత్ర‌స్తాయికి పంపించిన ప్ర‌భుత్వం .. అక్క‌డి నుంచే రైతుల‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసింది. ఎన్ని ఎక‌రాల్లో పంట న‌ష్ట‌పోయిందీ తెలుసుకుంది. వ‌డ‌గ‌ళ్ల వాన‌కు సంబంధించిన ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు లేక‌పోవ‌డంపైనా ఆరా తీసిన ప్ర‌భుత్వం రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని.. న‌ష్టాన్ని ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని మంత్రి అచ్చెన్నాయుడు భ‌రోసా ఇచ్చారు.

అయితే.. ఇంత జ‌రిగినా.. సొంత నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టించుకోని జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై.. మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆదుకునేందుకు ఎమ్మెల్యే లు రెడీగా ఉంటార‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం సొంత ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని.. వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా. పులివెందుల‌లో కూడా జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాము రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని మీడియాకు చెప్పారు.

This post was last modified on March 24, 2025 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago