నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ సహా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తెలంగాణలో తాజాగా మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ‘హైదరాబాద్ స్థానిక సంస్థల’ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల ఘట్టం.. ఆ రోజు నుంచే ప్రారంభం కానుంది.
ఇక, ఎన్నికల పోలింగ్ మాత్రం ఏప్రిల్ 23వ తేదీన జరగనుంది. నామినేషన్ల దాఖలుకు.. ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఏప్రిల్ 9వ తేదీ గా నిర్ణయించారు. అదేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 25న జరుగుతుంది. అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.
ఎలా ఖాళీ అయింది?
ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ప్రభాకర్‌రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ సహా.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అటు ప్రభుత్వ పక్షానికి, ఇటు బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం వంటి విపక్షాలకు కూడా.. కీలకంగా మారింది.
This post was last modified on March 24, 2025 2:29 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…