అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ మహిళా నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ నమోదు చేసిన కేసు ఏపీలో రాజకీయ మంటలను రాజేసింది. ఈ కేసు టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే నమోదు అయ్యిందని రజినీ ఆరోపించారు. తాజాగా రజినీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం మీడియా ముందుకు వచ్చిన లావు.. తప్పు చేసి తనపై నిందలేస్తే ఎలాగని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా తనను లాగారన్న లావు.. ఈ కథ వెనుక వారందరినీ బయటకు లాగుతానని…ఆ తంతు మొతాన్ని బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పల్నాడు జిల్లా యడ్డవల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నుంచి రూ.5 కోట్లను డిమాండ్ చేసిన రజినీ…చివరకు రూ.2.20 కోట్లను తీసుకున్నారని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టి నిర్ధారించగా… తాజాగా ఏసీబీ కూడా ఈ వ్యవహారం నిజమేనని రజినీ సహా ఆమె మరిది, నాడు విజిలెన్స్ అదికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై స్పందించేందుకు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన రజినీ.. లావు శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తానుంటున్న పార్టీలోనే ఎంపీగా ఉన్న లావు.. తన కాల్ డేటాతో పాటుగా తన ఫ్యామిలీ మెంబర్ల కాల్ డేటాను తీశారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు.
రజినీ ఆరోపణలపై లావు కూడా వేగంగానే స్పందించారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నప్పుడు బాగానే ఉందని…దానిపై కేసులు నమోదు అయితే బాధపడిపోతున్నారని లావు విమర్శించారు. అక్రమాలు చేసినప్పుడు తాను గుర్తుకు రాలేన్న లావు… నేడు కేసులు నమోదు అయితే మాత్రం తాను గుర్తుకు వస్తున్నానని… నింద తన మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తన వ్యక్తిత్వం ఏమిటన్న విషయం పల్నాడు జిల్లా వాసులకు తెలుసునని ఆయన అన్నారు. ఈ కొత్త కథ వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారందరినీ బయటకు లాగుతానని, ఇది ఎంతదాకా వెళుతుందో చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు తన పేరు వాడుతున్నారన్న లావు… ఈ గేమ్ ను వారు మొదలుపెట్టారని… దానిని తాను పూర్తి చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.
వాస్తవానికి ఇటు లావు, అటు రజినీ… ఇద్దరూ 2019 ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ వైసీపీతోనే చట్టసభల్లో అడుగుపెట్టాురు. లావు నరసరావుపేట నుంచి ఎంపీగా గెలవగా… చిలకలూరిపేట నుంచి రజినీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల దాకా ఇద్దరూ వైసీపీలోనే కొనసాగారు. వారి మద్య పెద్దగా విభేదాలున్నట్లుగా కూడా ఏనాడూ వార్తలు వినిపించలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీని వీడిన లావు టీడీపీలో చేరి నరసరావుపేట నుంచే తిరిగీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే జగన్ ఆదేశాలతో చిలకలూరిపేట వదిలిన రజినీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చిన రజినీ.. ఎప్పుడూ లావు పేరును ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏకంగా ఏసీబీ కేసుతో ఆమె లావు పేరును ప్రస్తావించారు. దీనికి లావు కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమేనని చెప్పాలి.
This post was last modified on March 24, 2025 12:41 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ…
తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు.…
సన్నిడియోల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన జాట్ వచ్చే నెల ఏప్రిల్ 10…
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందులలో రైతులకు భారీ కష్టం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు…