Political News

మండ‌లి ముచ్చ‌ట‌: వారికి మోక్షం ఎప్పుడు ..!

శాస‌న మండ‌లిలో ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ తెలియ‌డం లేదా? వైసీపీ త‌ర‌ఫున గతంలో మండ‌లిలో చ‌క్రం తిప్పిన నాయ‌కులు.. త‌ర్వాత రాజీనామాలు స‌మ‌ర్పించినా.. వీటిని ఆమోదించాల్సిన మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోష‌న్ రాజు ఇప్ప‌టికీ వాటిని అనుమ‌తించ‌లేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీ లు త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్ప‌టికి న‌లుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వీరు త‌మ ప‌ద‌వుల‌ను వ‌దులుకుని.. నాలుగు మాసాలు కూడా దాటింది.

అయితే.. వీరు అటు ఇటు ఎటూ కాకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. రాజీనామాలు ఆమోదిస్తే.. వేరే పార్టీలోకి వెళ్లి.. అక్క‌డ నామినేటెడ్ ప‌ద‌వులు అయినా ద‌క్కించుకోవాల‌ని వీరు చూస్తున్నారు. కానీ, చైర్మ‌న్ మాత్రం వీటిపై సంత‌కాలు చేయ‌డం లేదు. పోనీ.. స‌భ‌కు వెళ్లాలి.. కాసేపు ఏదో ఒక ర‌కంగా.. స‌భ‌లో ఉండాల‌ని అనుకుంటే.. అలా కూడా అవ‌కాశం కోల్పోయారు. “మీరు మీ ప‌ద‌వులకు రాజీనామా చేసినందున‌.. మండ‌లి కార్య‌క్ర‌మాల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు” అని అధికారులు తేల్చి చెబుతున్నారు.

దీంతో ప్ర‌స్తుతం వైసీపీకి రాజీనామాలు చేసిన న‌లుగురు ఎమ్మెల్సీలు బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, పోతుల సునీత‌, క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌లు గ్యాల‌రీల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. రాజీనామాలు చేసిన వారికి నిర్ణీత స‌మ‌యంలోగా.. నిర్ణ‌యం వెలువ‌రించాల్సిన బాధ్య‌త మండ‌లి చైర్మ‌న్ పై ఉన్న‌ప్ప‌టికీ.. అది ఆయ‌న స్వేచ్ఛ‌కు ప‌రిమిత‌మైన వ్య‌వ‌హారం. దీంతో ఎవ‌రూ కొశ్చ‌న్ చేయాల్సిన అవ‌కా శం లేకుండా పోయింది.

అయితే.. న్యాయ‌పోరాటం చేయొచ్చు. కానీ, ఆదిశ‌గా అడుగులు వేస్తే.. ఇబ్బంది త‌ప్ప‌ద‌న్నఆలోచ‌న‌తో వైసీపీ రిజైన్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో నామినేటెడ్ ప‌ద‌వులు కూడా ఫిల్ అవుతున్నా యి. దీంతో మ‌రింత గంద‌ర‌గోళంలోనే ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి ఇత‌ర పార్టీల్లో చేరినా.. తిరిగి వారికి ఆయా స్థానాలు ద‌క్కుతాయా? ద‌క్క‌వా? అనేది మ‌రో కీల‌క సందేహంగా మారింది. దీంతో వీరంతా త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 24, 2025 10:48 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

19 minutes ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

6 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago