దేశంలో డీలిమిటేషన్ జరిగితే(పార్లమెంటు స్థానాల పునర్విభజన) అది దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ లకు తీవ్ర నష్టం తెస్తుందని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన తన ఫేస్ బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రపంచ దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఉదహరించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, అమెరికా దేశాలు సహా ఇతర దేశాల్లో జరిగిన డీలిమిటేషన్ కారణంగా.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఎలా నష్టపోయిందీ వివరించారు. ఇదే విధానం పాటిస్తే.. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సరికాదన్న నాని.. ఈ విధానమే గతంలోనూ అవలంబించారు కాబట్టి.. ఇప్పుడు దీనిని మార్చి నూతన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రాంతాల వారీగా డిలిమిటేషన్‌ను అమలు చేయాలని మాజీ ఎంపీ సూచించారు. తద్వారా.. నియోజకవర్గాలపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చన్నారు. జనాభా నియంత్రణ విషయానికి వస్తే..ఉత్తరాది రాష్ట్రాలు అసలు పట్టించుకోలేదన్నారు. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో పలు పథకాలుపెట్టి మరీ.. జనాభా నియంత్రణను అమలు చేశారని.. తెలిపారు. ఇది ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు శరాఘాతంగా మారిందని చెప్పారు.
ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు కొన్నాళ్లు వెయిట్ చేయడం.. లేదా జనాభా ప్రాతిపదికన కాకుండా నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉండడం వంటి రెండే మార్గాలు అందుబాటులో ఉన్నాయని కేశినేని నాని తెలిపారు. అధిక జనాభా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందని, ఇది న్యాయం కాదని చెప్పారు. జనాభా నియంత్రణ, సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా? అని ప్రశ్నించారు. దీనిపై అన్ని పక్షాలు కలిసి రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ అజెండాగా కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాల అజెండాగా మార్చుకుని.. ప్రభుత్వాలు, పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేయాలని ఆయన సూచించారు.
This post was last modified on March 24, 2025 10:33 am
అభిమానులతో సహా అందరిలోనూ ఉన్న సందేహం ఒకటే. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఎడతెగని బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్…
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో హీరో హీరోయిన్ల జంట అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లను సక్సెస్ ఫుల్ పెయిర్గానే…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత…
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని…
వైసీపీని, జగన్ను కూడా కాదనుకుని.. ఏపీ ప్రజలు కూటమికి ముఖ్యంగా చంద్రబాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో..…
టీజర్ నుంచి పాటల దాకా ప్రశంసల కన్నా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ ట్రైలర్ ఇవాళ…