వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ ఇప్పుడు పెను కష్టాల్లో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజినీ, ఆమె మరిది గోపి, ఈ దందాలో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, వ్యవహారాన్ని గుట్టుగా నడిపిన రజినీ పీఏలపై ఏసీబీ శనివారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రజినీ ఘాటుగా స్పందించారు.
కేసు గురించి ఆదివారం ఉదయం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్బంగా తనపై కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రజినీ ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన ఓ మహిళను అయిన తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే… కూటమి నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏసీబీ కేసులు నమోదు చేశారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్న రజినీ… ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
అనంతరం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి రజినీ… ఆదివారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఈ పోస్టులో ఒకింత కవితాత్మకతను జోడించిన రజినీ… కూటమి సర్కారుపై ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటించారని చెప్పక తప్పదు. ”మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు… వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు.. ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే… అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ. నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురుచూస్తూ ఉంటా. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…” అంటూ సదరు పోస్టులో ఆమె పేర్కొన్నారు.
This post was last modified on March 23, 2025 3:24 pm
మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కౌంట్ డౌన్ ఇంకో అరవై ఏడు రోజులు మాత్రమే ఉంది. విజయ్…
తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దీనికి…
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు తగిన విధంగా శాస్తి చేస్తామని బీజేపీ ఏపీ కీలక నాయకుడు, మాజీ…
2019 ఎన్నికల ముంగిట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన మిత్రుడైన రామ్ తాళ్ళూరి గతంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి…
ఇంకో ఏడాది ఉండగానే 2026 మార్చి బాక్సాఫీస్ పోటీ వేడెక్కిపోతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా అదే నెలలో వచ్చేందుకు…