Political News

‘విశాఖ’ కూడా వైసీపీ చేజారిపోయింది!

ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీ పాలక వర్గంలో వైసీపీకి పెద్దగా మెజారిటీ లేకున్నా…ఎలాగోలా నెట్టుకువస్తోంది. అయితే శనివారం జీవీఎంసీ మేయర్ పై కూటమి పక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి.

జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగగా… మొత్తం 98 సీట్లకు నాడు అధికారంలో ఉన్న వైసీపీ 59 సీట్లను గెలిచింది. నగరంలో గట్టి పట్టున్న టీడీపీ 29 సీట్లకు పరిమతం కాగా… జనసేన 3 సీట్లు…బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కో సీటు, స్వతంత్రులు 4 సీట్లలో విజయం సాదించారు. వెరసి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని దానిపై గొలగాని హరి వెంకట కుమారిని కూర్చోబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీ పరిదిలోనూ ఇదే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీల బలం నాడు 33 సీట్లకే పరిమితం కాగా ఇప్పుడు ఆ బలం ఏకంగా 70కి చేరిపోయింది.

ఇంకేముంది…ఆ 70 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిసి శనివారం జీవీఎంసీ ఇంచార్జీ కమిషనర్ గా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిశారు. మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని వారు ఓ అర్జీని ఆయనకు అందించారు. దానిపై 70 మంది కార్పొరేటర్ల సంతకాలు, ఎక్ష్ అఫీసియో సభ్యుల సంతకాలు పెట్టి మరీ అందించారు. ఈ వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. త్వరలోనే దానిని పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపడతామని తెలిపారు. జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98 కాగా… 70 మంది అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే… దానిని తిరస్కరించే ఛాన్సే లేదు. అంటే… తీర్మానం ప్రవేశపెట్టడం, వైసీపీ నుంచి జీవీఎంసీ పగ్గాలు కూటమికి దక్కడం ఖాయమేనన్నమాట.

This post was last modified on March 23, 2025 11:10 am

Share
Show comments
Published by
Satya
Tags: Vizag YCP

Recent Posts

చిరు – రావిపూడి కోసం బాలీవుడ్ భామలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…

8 minutes ago

ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు

తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…

1 hour ago

‘ఎక్స్’ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. ట్విస్టు మామూలుగా ఉండదు

వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ…

1 hour ago

టాక్ తేడా ఉన్నా 100 కోట్లు లాగేసింది

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎల్2 ఎంపురాన్ కు మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో డివైడ్ టాక్ వచ్చిన…

2 hours ago

సమీక్ష – మ్యాడ్ స్క్వేర్

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప సీక్వెల్స్ వస్తే వాటికి క్రేజ్ రావడం సహజం. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన…

5 hours ago

బాబు, లోకేశ్ గిబ్లీ ట్రెండ్స్ అదిరిపోయాయబ్బా!

సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్బీ ట్రెండ్స్ నడుస్తోంది కదా. జపాన్ కు చెందిన యానిమేషన్ స్టూడియో ఒరవడిని అందిపుచ్చుకుని... ఆ…

8 hours ago