విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించడంలో ఏపీలోని కూటమి సర్కారు వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పక తప్పదు. బ్లూఫాగ్ సర్టిఫికెట్ అంటేనే… అదో ప్రత్యేక గుర్తింపు కిందే లెక్క. ఈ గుర్తింపు ఉన్న బీచ్ లకు విదేశీ పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. ఫలితంగా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి విదేశీ, సంపన్న పర్యాటకులను రాబట్టాలంటే… ఆ బీచ్ లను ఏ రీతిన నిర్వహించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
గతంలో రిషికొండ బీచ్ లో ఏపీ సర్కారు చేపట్టిన పరిశుభ్రత, ఇతర భద్రతా చర్యలను పరిశీలించిన డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఏ)… బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును కేటాయించింది. ఈ గుర్తింపు కింద ఆ సంస్థ అందజేసే ఓ బ్లూ జెండాను బీచ్ ఎంట్రెన్స్ లోనే ప్రదర్శిస్తారు. అయితే ఇటీవల బీచ్ నిర్వహణలో స్థానిక పర్యాటక శాఖ అధికారులు అంతగా దృష్టి సారించినట్లు లేరు. బీచ్ లో పరిశుభ్రత కనిపించకపోగా.. మరుగు దొడ్ల నిర్వహణ కూడా సరిగా లేదట. అంతేకాకుండా బీచ్ లో వీధి కుక్కల స్వైర విహారం బాగా పెరిగిపోయిందట. దీంతో ఈ పరిసరాల ఫొటోలను తీసి ఎఫ్ఏఏకు కొందరు వ్యక్తులు పంపారట.
సదరు ఫొటోలను చూసిన వెంటనే ఎఫ్ఏఏ వేగంగా స్పందించింది. పరిసరాలు పరిశుభ్రంగా లేని బీచ్ లకు బ్లూఫాగ్ ను కొనసాగించలేమని చెబుతూ రిషికొండ బీచ్ ఎంట్రెన్స్ లో ఉన్న తన జెండాను ఈ నెల 2న తొలగించింది. దీంతో మీడియా అంతా ఒక్కసారిగా రిషికొండకు బ్లూఫాగ్ తొలగిన విధానంపై పెద్ద ఎత్తన వార్తాకథనాలను ప్రసారం చేసింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. రిషికొండకు బ్లూఫాగ్ తొలగడం, దానికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటుగా సత్వరంగా బీచ్ కు బ్లూఫాగ్ పునరుద్ధరణ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎఫ్ఏఏ చేత బ్లూఫాగ్ ను పునరుద్ధరించేలా చేసింది.
This post was last modified on March 23, 2025 12:31 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…