Political News

మా వోళ్లే పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసిన్రు: ఎమ్మెల్యే

ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేత‌ల‌పై కా మెంట్లు కుమ్మ‌రించారు. “మా వోళ్లే గ్రూపులు క‌ట్టి.. పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వ‌చ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు క‌ట్టే నాయ‌కుల‌ను ప్రోత్స‌హించ‌రాద‌ని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసిన‌ట్టు చెప్పారు. త్వ‌రలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుంద‌న్నా రు. అయితే.. ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జ‌రిగితే.. ప్ర‌యోజ‌నం లేద‌న్నారు.

రాష్ట్రంలో నాయ‌కులు త‌మ‌కు భ‌జ‌న‌చేసే బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నార‌ని.. దీనివ‌ల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ధైర్యంగా ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. చేతులు కాళ్లు క‌ట్టేసిన‌ట్టు ఉంద‌న్నారు. అందుకే.. కేంద్రంలోని సెంట్ర‌ల్ క‌మిటీనే రాష్ట్రానికి అధ్య‌క్షుడిని ఎంపిక‌చేయాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పా రు. పైగా ధ‌ర్మాన్ని రక్షించే నాయ‌కుడిని.. ధ‌ర్మం కోసం జైలుకు వెళ్లాల్సి వ‌స్తే.. అందుకు సిద్ధ‌ప‌డే నాయ కుడిని ఎంపిక చేయాల‌ని రాజా సింగ్ సూచించారు.

ముఖ్యంగా గ్రూపులు క‌ట్టే నాయ‌కులు వ‌ద్ద‌న్నారు. గ‌తంలో చేసిన బీజేపీ అధ్య‌క్షులు అంద‌రూ గ్రూపు రాజ‌కీయాలు చేశార‌ని రాజా సింగ్ దుయ్య‌బ‌ట్టారు. అందుకే రాష్ట్రంలో పార్టీ ఎద‌గ‌లేక‌పోయింద‌న్నారు. కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటే ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఇప్ప‌టికే అనేక ర‌బ్బ‌ర్ స్టాంపులు ఉన్నాయ‌ని సంచలన వ్యాఖ్య‌లు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు.. లాబీయింగ్‌ల‌ను కొరుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on March 22, 2025 3:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

స్టార్ హీరోకు ఆనందాన్నివ్వని బ్లాక్‌బస్టర్

పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. రాజ‌కీయం ఎక్క‌డ‌మ్మా?!

కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి త‌ట్టుకోలేక‌.. ఇంటి ప‌ట్టునే ఉంటున్నారా? అంటే..…

2 hours ago

స‌ల‌హాదారులు కావ‌లెను.. బోర్డు పెట్టిన జ‌గ‌న్‌?

వైసీపీ ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖ‌చ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 2012లో…

4 hours ago

ఆర్య-2.. ఆ టైటిల్ పెట్టాల్సింది కాదు

తెలుగులో ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంఛైజీ చిత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ తరహా చిత్రాలు చాలా తక్కువగా…

6 hours ago

వీడియో : జైలు నుండి పోసాని విడుదల

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల…

9 hours ago

తమన్నా సినిమాకు రిస్కీ రిలీజ్ డేట్

ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కానీ తన తరం మిగతా హీరోయిన్ల లాగే…

10 hours ago