తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన అఖిల పక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ అధినేతలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. తద్వారా.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిర్వహించిన బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు నిర్వహించిన సమావేశం సక్సెస్ అయిందనే చెప్పాలి.
వాస్తవానికి గతంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా.. చక్రం తిప్పారు. వారు కూడా.. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, మూడో పక్షం అంటూ.. ప్రయత్నాలు చేసినా.. అవిపెద్దగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అయితే.. పూర్తిగా విచ్చిన్నమైందనే చెప్పాలి. మోడీకి వ్యతిరేకం అంటూనే.. కాంగ్రెస్ పార్టీ.. తనతో కలిసివచ్చిన పార్టీలను కూడా నిలుపుకోలేక పోయింది. ఫలితంగా ఇండియా కూటమి సక్సెస్ కాలేకపోయింది.
అయితే.. స్టాలిన్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ డీఎంకే పార్టీ నేతృత్వంలో నిర్వహించిన తాజా సమావేశానికి మాత్రం అనూహ్యమైన స్పందన వచ్చింది. డీలిమిటేషన్ ప్రక్రియ సహా జీఎస్టీ పన్నుల్లో వాటాలు, హిందీ భాషపై స్టాలిన్.. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేవలం డీలిమిటేషన్ ప్రక్రియపైనే విపక్ష పాలిత రాష్ట్రాలను ఏకం చేసినా.. ఇది మున్ముందు.. మోడీకి వ్యతిరేక అజెండాను ఎంచుకునే విషయంలో స్టాలిన్‌కు దోహద పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మోడీకి ఎదురు వెళ్లే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ సీఎంమమతా బెనర్జీ బలమైన గళం వినిపిస్తున్నా.. ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్‌ను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ సమయంలో స్టాలిన్ చేపట్టిన ఈ సమావేశం ద్వారా.. ప్రత్యామ్నాయ శక్తిగా ఆయన ప్రతిపక్షాలను(కాంగ్రెస్ సహా) ఏకతాటిపైకి తీసుకురాగల శక్తి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత వ్యూహంతో ముందుకు సాగితే.. మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
This post was last modified on March 22, 2025 3:04 pm
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల…
ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కానీ తన తరం మిగతా హీరోయిన్ల లాగే…
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండగ తొలి సినిమాగా వచ్చిన గేమ్ ఛేంజర్ ముమ్మాటికీ డిజాస్టరే. అందులో ఎలాంటి సందేహం…
నిన్న ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు మూకుమ్మడిగా బాక్సాఫీస్ మీద దాడి చేశాయి. ఒక్కదానికి…
ఒక సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంగీకారం తెలిపినపుడు అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ మీద ఇరు పక్షాలు సంతకాలు చేసుకోవడం మామూలే.…
నిర్మాత దిల్ రాజు సుడి కొత్త సంవత్సరంలో మహా భేష్షుగా ఉంది. గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్…