టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా తనపై నమోదు అయిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్, కొన్నింటిలో అరెస్టుల నుంచి మినహాయింపు పొందిన పోసానికి… తాజాగా సీఐడీ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ లెక్కన పోసానిపై నమోదు అయిన అన్ని కేసుల్లోనూ ఆయనకు ఊరట లబించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆర్డర్లు జైలు అదికారులు అంది… పోసాని జైలు నుంచి విడుదలయ్యే దాకా ఇంకో కొత్త కేసేదీ నమోదు కాకపోతే ఆయన రిలీజ్ అయినట్టేనని చెప్పాలి.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోసానిపై ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 16 కేసుల దాకా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు చర్యలు మొదలుపెట్టి… హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పల్నాడ జిల్లా, కర్నూలు జిల్లా పోలీసులు వరుసబెట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్న పోసానిని… సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో గతంలో తమ వద్ద నమోదైన ఓ కేసు ఆధారంగా పోసానిని సీఐడీ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో కోర్టు పోసానిని విచారించాల్సి ఉందని సీఐడీ అదికారులు పిటిషన్ దాఖలు చేస్తే… ఇప్పటికే బెయిల్ వచ్చిన కేసులోనే తనను అరెస్ట్ చేశారని చెప్పిన పోసాని… ఈ కేసులోనూ తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిలో సీఐడీ పిటిషన్ ను తొలుత పరిష్క్రరించిన కోర్టు… పోసానికి ఒక్క రోజు సీఐడీ కస్టడీని విధించింది. అది కూడా ముగిసింది. తాజాగా పోసాని బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా… శుక్రవారం మద్యాహ్నం తర్వాత కోర్టు తన తీర్పును వెలువరించింది. పోసాని కోరినట్టుగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ బెయిల్ ద్వారా అయినా ఆయన జైలు నుంచి విడుదల అవుతారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 21, 2025 5:12 pm
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…
చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని…
ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది.…