వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పోలీసు కస్టడీకి సిద్ధం కాక తప్పలేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వంశీని విచారించాల్సి ఉందని… ఈ కారణంగా వంశీని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఇటీవలే వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి వంశీ బెజవాడలోని జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా వంశీ పోలీసు కస్టడీని ఎదుర్కొన్నారు. ఆ విచారణలో వంశీ పెద్దగా విచారణకు సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. కనీసం తన ఫోన్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని కూడా వంశీ పోలీసులకు చెప్పలేదట. అయితే తాడేపల్లి వెళ్లిన విషయాన్ని ఒప్పేసుకున్న వంశీ.. జగన్ ను మాత్రం కలవలేదని చెప్పారు.
తాజాగా 3 రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి వెళ్లనున్న వంశీ… ఈ విచారణలో ఏఏ అంశాలను వెల్లడిస్తారన్నవిషయంపై ఆసక్తి నెలకొంది. లా అండ్ ఆర్డర్ పోలీసుల కంటే సీఐడీ పోలీసుల విచారణ ఒకింత వెరైటీగా ఉంటుందనే చెప్పాలి. నిందితుడిని ఇబ్బంది పెట్టకుండానే… లాఘవంగా వారి నుంచి సమాధానాలు రాబట్టే విషయంలో సీఐడీ పోలీసులకు మంచి పట్టే ఉందని చెప్పక తప్పుదు. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి పక్కా ఆధారాలను ముందు పెట్టి మరీ సీఐడీ అదికారులు నిందితులను ప్రశ్నిస్తారు. ఫలితంగా వంశీ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి దారి తీసిన అసలు వాస్తవాలను బయటపెట్టక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 20, 2025 4:30 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…