ఏపీలో వైసీపీకి స్వపక్షంలో విపక్షంలా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతపార్టీపైనే సందర్భానుసారంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిష్టియానిటీ పెరుగుతోందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది 25 శాతం ఉందని రఘురామ అన్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని, కానీ,ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లీగల్ ప్రొటెక్షన్ ఫోరం వారు సమర్పించారని,, త్వరలో ఆ వివరాలల్నీ బయటకు వస్తాయని రఘురామ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రఘురామ ఈ వ్యవహారంపై తాజాగా లేఖ రాశారు.
ఏపీలో యథేచ్ఛగా మత మార్పిడులు జరుగుతున్నాయని, 2011లో 1.8 శాతంగా ఉన్న క్రిష్టియన్ల జనాభా 2020 నాటికి 25 శాతానికి పెరిగిందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ గణాంకాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవని, అనధికారికంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారని,ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.
ఏపీలో 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా జీవో వచ్చిందని, ఇటీవల ఏపీలో 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు సమాచారం ఉందని అన్నారు. గుళ్లకు సమాన సంఖ్యలో చర్చిలను ఏర్పాటు చేశారని, 2021 జనాభా లెక్కల్లో మత మార్పిడి చేసుకున్న వారిని గుర్తించి అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాజాగా రఘురామ రాసిన లేఖపై మోడీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on October 28, 2020 6:38 pm
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…