Political News

త‌లా కొంచెం.. తెలంగాణ బ‌డ్జెట్ తీరిదే!

నొప్పింప‌క.. తానొవ్వ‌క‌.. అన్నట్టుగా.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను తీర్చి దిద్దింది. డాంబికాల‌కు పోకుండా.. అలాగ‌ని ఎవ‌రినీ విస్మ‌రించ‌కుండా.. అన్ని వ‌ర్గాల‌ను అంతో ఇంతో సంతృప్తి ప‌రిచేలాగానే.. వార్షిక బ‌డ్జెట్ను రూపొందించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. కీల‌క‌మైన వ్యవ‌సాయ, విద్య‌, ఉపాధికల్ప‌న రంగాల‌కు మాత్రం.. ఈ బ‌డ్జెట్ విదిలింపేన‌ని చెప్పాల్సి ఉంటుంది. బ‌ల‌మైన సాగు రంగాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని.. రెండు రోజుల కింద‌ట సీఎం రేవంత్ రెడ్డి స‌భాముఖంగా చెప్పుకొచ్చారు.

కానీ, ఆయ‌న మాట‌ల్లో ఉన్నంత బ‌లం.. సాగుకు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించే విష‌యంలో లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం.. ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు సాగు కు కేటాయించాల‌ని.. వ్య‌వ‌సా య శాఖ ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. కానీ, దీనిలో పావు వంతు మాత్ర‌మే(24,439 కోట్లు) కేటాయించ‌డం ద్వారా.. సాగుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా.. సానుకూల రోజులు తేలేక‌పోతోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రో కీల‌క‌మైన శాఖ ప‌శుసంవ‌ర్ధ‌కం.

దీనికి మ‌రీ నాసిర‌క‌మైన కేటాయింపులు ఉండ‌డం గ‌మ‌నార్హం. పశుసంవర్థక శాఖకు – రూ.1,674 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భ‌ట్టి.. రాష్ట్రంలో ప‌శువుల కాప‌రుల‌కు మేలు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డం విశేషం. పౌర సరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు. కానీ, దీనివ‌ల్ల పెద్దగా మేలు జ‌రిగే అవ‌కాశం లేదు. అయితే.. కేంద్రం ఎలానూ ఉచిత బియ్యం ఇస్తున్న ద‌రిమిలా.. రాష్ట్రం త‌న వాటాను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంది.

ఇక‌, సామాజిక వ‌ర్గాల‌కు ఈ బ‌డ్జెట్‌లో పెద్ద‌పీట వేశార‌నే చెప్పాలి. ఎస్సీ సంక్షేమానికి ఏకంగా మ‌రో మాట‌లో చెప్పాలంటూ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ.40,232 కోట్లు కేటాయించారు. అలానే ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు ఇచ్చారు. మ‌రో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం మైనర్టీల‌ సంక్షేమంకోసం రూ.3,591 కోట్లు కేటాయించారు. అయితే.. ఇవి కొంత మెరుగ్గానే ఉన్నా.. మిగిలి వాటి విష‌యంలో మాత్రం నొప్పింప‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగానే ఉంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

This post was last modified on March 20, 2025 7:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago