Political News

పెట్టుబడుల్లో ‘పార్టీ’ల గోల.. బాబు ఏమన్నారు

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద ఈ కంపెనీకి ఏకంగా 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ వైసీపీ కీలక నేతల బినామీ కంపెనీగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

కేబినెట్ బేటీలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన పలువురు మంత్రులు వైసీపీ నేతలకు చెందిన కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడం సరికాదేమోనని అన్నారట. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే మంచిదని కూడా వారు అభిప్రాయపడ్డారట. ఈ సందర్బంగా కలుగజేసుకున్న సీఎం చంద్రబాబు…పెట్టుబడుల విషయంలో రాజకీయాల గోల ఎందుకని ప్రశ్నించారట. ఆయా కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నప్పుడు.. వాటి ప్రతిపాదనలను పరిశీలించి… అవసరమైన మేరకు ప్రోత్సాహం ఇద్దామని తెలిపారట. అంతేకాకుండా పార్టీల గోలను పక్కనపెట్టి…ఆయా కంపెనీలు నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తేల్చేశారట.

నిజమే మరి… చాలా కంపెనీలకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటమో… లేదంటే రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే ఆయా కంపెనీలు నడుస్తుండటమో కొత్తేమీ కాదు. రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడేలా… రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలను రావొద్దని చెప్పడం కుదరదు. అలా చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు సమర్పించే ప్రతిపాదనలు సరిగా ఉంటే ఓకే… లేదంటే వాటికవే రిజెక్ట్ అవుతాయి కదా. ఇందులో రాజకీయాల గోల అవసరం లేదంటూ చంద్రబాబు తేల్చేశారు. ఎలాగూ ఆయా కంపెనీలు నిబంధనలు పాటించకున్నా కూడా ఆ ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అన్న బాబు మాటతో మంత్రులు మిన్నకుండిపోయారట,.

This post was last modified on March 18, 2025 4:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

నితిన్-విక్రమ్.. వేరే లెవెల్

యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…

5 minutes ago

శ్యామల కేసుపై హైకోర్టు ఎమందంటే…

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్…

14 minutes ago

గజిని-2.. డిస్కషన్లు మొదలయ్యాయ్

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య…

31 minutes ago

మంచి సినిమాకు టైమింగ్ మిస్సయ్యింది

ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…

2 hours ago

వేణు స్వామి… ఇంత నీచమా?

అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…

2 hours ago

సీఐడీ కోర్టులోనూ బెయిల్.. పోసాని రిలీజ్ అయినట్టేనా?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…

3 hours ago