అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం వస్తే… అట్టా గూగుల్ ను ఓపెన్ చేసి రీ వెరిఫికేషన్ చేసేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ జనానికి ప్రతినిధులుగా ఉన్న మన నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు ఆలోచించి.. మరీ అడుగు వేయాల్సి ఉంది. మరి టీడీపీ యువ నేత, నంద్యాల లోక్ సభ సభ్యురాలు బైరెడ్డి శబరి ఏం చేశారో తెలుసా?
కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలంటూ ఆమె నేరుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర మంత్రికి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అంతేనా… ఆ సందర్భాన్ని ఫొటో తీయించుకున్న ఎంపీ గారు… దానిని తన సోషల్ మీడియా ఖాతాల్లో స్వహస్తాలతో పోస్ట్ చేశారు. ఇందులో తప్పేముంది అంటారా? సరే.. అక్కడికే వెళ్లిపోదాం పదండి.
రాయలసీమకు ముఖద్వారంగా గుర్తింపు సంపాదించుకున్న కర్నూలు నగరానికి కూత వేటు దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటు దిశగా గతంలో చాలా కాలం క్రితమే అడుగులు పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఆ అడుగులు వేగంగా పడ్డాయి 2019 ఎన్నికల నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. దానిని ప్రారంభిద్దామనగానే.. ఎన్నికలు ముంచుకొచ్చేశాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడి, వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. సీఎం హోదాలోనే ఆయన కర్నూలు ఎయిర్ పోర్టుకు స్వాతంత్య్ర సమర యోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టారు. అదే పేరుతోనే ఆయన ఎయిర్ పోర్టును ప్రారంభించారు కూడా. ఇప్పటికీ ఎయిర్ పోర్టు ముఖద్వారం వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అనే పేరే ఉంది.
ఇప్పుడు కేంద్ర మంత్రిని కలిసిన శబరి.. కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని కోరారు. మరి శబరి వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారో, లేదంటే… అలా తీసుకున్నారో తెలియదు గానీ… వినతి పత్రం తీసుకుంటూ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. శబరి పోస్టును చూసిన వెంటనే…అదేంటండీ.. ఇప్పటికే దానికి అదే పేరు ఉంది కదా అంటూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు సంధిస్తున్నారు.
This post was last modified on March 17, 2025 9:16 pm
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…