ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరో సారి తన విశ్వరూపం ప్రదర్శించారు. గత వైసీపీ పాలనపై ఆయన దుమ్మెత్తి పోశారు. అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం.. చివరకు రెక్కాడితేకానీ.. డొక్కాడని కూలీల సొమ్మును కూడా కొట్టేసిందని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద.. కూలీలకు దక్కాల్సిన రూ.250 కోట్లను వైసీపీ నాయకులు సొంతం చేసుకున్నారని ఆధారాలతో సహా సభకు వివరించారు.
ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధి హామీ పథకంగా వైసీపీ నాయకులు మార్చుకున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. కూలీలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టానన్నారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకాన్ని అందరికీ చేరువ చేసి.. కూలీల కడుపు నింపాలని భావించినట్టు చెప్పారు. అయితే.. వైసీపీ హయాంలో ఈ పథకం అమలు చేసినప్పుడు కోట్ల రూపాయలను కొట్టేసిన విషయం వెలుగు చూసిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పథకం నీరు గారిపోయిందన్నారు. ఉపాధి హామీ పథకం లో అవకతవకలు జరుగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. రూ.250 కోట్ల అవినీతి ఉపాధి హామీ పథకంలో జరిగిందని తెలిసిన తర్వాత.. నా నోట మాట రాలేదని పవన్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈఅవినీతిని పక్కాగా చేయడంతో సాక్ష్యాధారాలను కూడా లేకుండా చేశారని తెలిపారు. దీంతో రూ.250 కోట్లలో కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.
ఎలాంటి ఉపాధి పనులు చేయకుండానే చేసినట్లు రాసి సొమ్ములు తీసుకున్నారని పవన్ ఆరోపించారు. ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద ని.. ఇలా.. కేంద్రం నుంచి వచ్చిన సొమ్మును కూడా.. కాజేశారని.. ఒక్కరికి నెలకు 15 రోజుల పాటు పని కల్పించాల్సి ఉంటుందని.. కానీ.. వైసీపీ హయాంలో ఒకే వ్యక్తికి నెలలో రెండు సార్లు పని కల్పించినట్టు రాసి సొమ్ములు కాజేశారని ఆరోపించారు. దీనిపై నిశితంగా దృష్టి పెట్టినట్టు పవన్ కల్యాణ్ వివరించారు.
This post was last modified on March 17, 2025 3:11 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…