Movie News

బెట్టింగ్ యాప్స్‌పై ప్లేటు తిప్పేస్తున్న సెలబ్రెటీలు

డబ్బులిస్తున్నారు కదా అని సెలబ్రెటీలు ముందు వెనుక చూసుకోకుండా ప్రమోషన్లు చేసి పెడితే ఏమవుతుందో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సెలబ్రెటీలను ముందు పెట్టి పెట్టుబడులను ఆకర్షించి బోర్డు తిప్పేసిన సంస్థలు ఎన్నో. ఇక గత కొన్నేళ్లలో చిన్న స్థాయి ఫిలిం సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకుని వందలు, వేల కోట్ల వ్యాపారం చేసిన బెట్టింగ్ యాప్స్.. ఎంతోమంది సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేసిన ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా అన్నట్లుగా సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే తీరు దారుణం అనే చెప్పాలి.

వీటి వలలో చిక్కుకుని యువత దారుణంగా దెబ్బ తింటున్న ఘటనలు రోజూ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీటి తీవ్రత గురించి పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వాటిని ప్రమోట్ చేసే వాళ్లు, వాటిని వినియోగించేవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిది ఒక సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ నేేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద పోలీసుల కన్ను పడింది. ఈ అంశం గురించి ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్.. ఇప్పుడు కార్యాచారణకు నడుం బిగించారు. ఆర్టీసీ ఎండీగా ఉంటూనే ఆయన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారి పని పట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే హర్ష సాయి మీద కేసు బుక్ చేయించి అరెస్ట్ చేయించే పనిలో పడ్డారు. ఈ పరిణామం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫిలిం సెలబ్రెటీల్లో గుబులు పుట్టిస్తోంది.

ప్రస్తుతం వైసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామలతో పాటు కమెడియన్ ఆలీ, సుప్రీత (సురేఖావాణి తనయురాలు), రితు చౌదరి.. సహా ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వాళ్లే. వీరిలో రితు, సుప్రీత లాంటి వాళ్లు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వీడియోలను డెలీట్ చేసేశారు. అంతే కాక గతంలో తెలియక వీటిని ప్రమోట్ చేశామని, అందుకు సారీ చెబుతూ.. ఎవ్వరూ వీటి జోలికి వెళ్లొద్దని హితవు పలుకుతున్నారు. హర్ష సాయి ఉదంతం నేపథ్యంలో తమను కూడా పోలీసులు టార్గెట్ చేస్తారనే భయంతోనే వీళ్లంతా ఇలా చేస్తున్నారన్నది వాస్తవం. ఎలాగైతేనేం ఇదొక మంచి మార్పే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on March 17, 2025 4:14 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

5 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

5 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

7 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

9 hours ago