ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా చేసుకుంటాయి. భారీ ఏర్పాట్లు చేసుకున్నా బాబు సర్కారు అంతగా పట్టించుకోదు. సరే… వారేదో సంబరాలు చేసుకుంటున్నారు కదా. వారి సంతోషాన్ని మనమెందుకు తగ్గించాలి? అన్నట్లుగా సాగుతుంది. అంటే.. అధికారంలో ఉన్నా గానీ చంద్రబాబు సహనంతో సాగుతారు.
అదే వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే… వైరి వర్గాలు సంబరాలే చేసుకోకూడదు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఆ సంబరాల్లో నిబంధనలు అతిక్రమించారంటూ ఉన్నపళంగా ఆంక్షల కత్తులను బయటకు తీసి.. ఆ సంబరాలను కాస్తా నిరసనలుగా మార్చేస్తుంది. అంటే… అధికారంలో ఉంటే జగన్ లో సహనం అన్నదే కనిపించదు. ఈ ఇద్దరి వైఖరులకు అద్దం పట్టేలా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు విషయంలోకి వెళితే… నేడు జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలికి వెళుతున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి పెళ్లి సోమవారం జరుగుతోందట. ఈ వేడుకకు జగన్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణంతో పాటుగా తెనాలికి దారి తీసే మార్గం జగన్ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. అదేదో వైసీపీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లుగా రహదారి నిండా జగన్, వైసీపీ బ్యానర్లే కనిపిస్తున్నాయి.
సరే.. మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనంతగా జగన్ దిగజారగా… ఎంతైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కదా అన్న భావనతో ఈ బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై అటు కూటమి సర్కారు, ఇటు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. సహనంతోనే సాగిపోతోందన్న మాట. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సరే… వైసీపీ అధికారంలో ఉండగా 2022లో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు కేంద్రంగా టీడీపీ మహానాడు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏటా మూడు రోజుల పాటు మహానాడు పేరిట పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2022లో ఒంగోలులో మహానాడును నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు నగర పరిసరాలన్నీ దాదాపుగా పసుపు మయం అయిపోయాయి.
అయితే నాడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఆంక్షల కత్తులను బయటకు తీసింది. నిబంధనల పేరిట మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించింది. ఈ పరిణామంపై నాడు టీడీపీ నిరసన వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. విపక్షంలో ఉన్న పార్టీలు ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదా అంటూ టీడీపీ నేతలు చేసిన వాదనలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి.
This post was last modified on March 17, 2025 10:01 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…