Political News

కేసీఆర్ ఆట మొదలైనట్టేనా..?

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఇటీవలే తిరిగి యాక్టివేట్ అయ్యారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయనను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆశీస్సులను మహిపాల్ రెడ్డి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసినంతనే.. కేసీఆర్ తిరిగి తన వ్యూహాలకు పదును పెట్టారన్న వాదనలు మొదలయ్యాయి.

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైనే పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి… అధికారం చేజిక్కించుకోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మహిపాల్ రెడ్డితో పాటుగా మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిపాల్ రెడ్డికి ఆది నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాటలా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తన అనుచరులతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధిష్ఠానం చెవిన కూడా పడ్డాయి. ఫలితంగా మహిపాల్ రెడ్డిపై చర్యల దిశగానూ కాంగ్రెస్ సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కేసీఆర్ కబురు పెట్టారని.. దీంతోనే అందరి ముందే కేసీఆర్ వద్దకు వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే… కేసీఆర్ ఆట నిజంగానే మొదలైందని చెప్పక తప్పదు.

This post was last modified on March 13, 2025 12:47 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago