ఏపీ సీఎం చంద్రబాబు ఎంత లక్కీ అంటే… ఎమ్మెల్సీ సీటుపై ప్రగాఢ ఆశలు పెట్టుకున్న వారు కూడా.. కించిత్తు మాట అనకుండా.. సర్దుకుపోతున్నారనేంతగా ఆయన లక్కీ అనే చెప్పాలి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల టికెట్లను పంచేశారు. అయితే.. ఆశావహులకు ఒక్కరికీ దీనిలో చోటు దక్కలేదు. దీంతో ఇంకేముంది.. పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుడుతుందని.. పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఎదురు చూశారు.
కానీ, అనూహ్యంగా టికెట్లు ఆశించిన వారు చంద్రబాబుపై విధేయతను చూపించారు. ఆయన పరిస్థితిని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. అంతేకాదు.. చంద్రబాబు అడుగుజాడల్లో నదవడం కంటే తమ కు పెద్ద పెద్ద పదవులు ఏముంటాయని కూడా ముక్తాయించారు. ఇలా.. ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఆశించిన పిఠాపురం వర్మ నుంచి విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న వరకు అందరూ.. ఇదే సూత్రాన్ని పాటిం చారు. నిజానికి ఇంత మార్పు వస్తుందని పార్టీ అధినేత కూడా భావించి ఉండరు.
ఇక, తాజా పరిణామాలను గమనిస్తే.. వర్మకు టికెట్ ఖాయమని దాదాపు అందరూ అనుకున్నారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, పైగా ఐదు స్థానాలు భర్తీ అవుతున్నాయని అనుకుంటే.. వాటిలో ఖచ్చితం గా వర్మ పేరు ఉంటుందన్న చర్చ వచ్చింది. ఇక, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇటీవల కాలంంలో యాక్టివ్ అయిన టీడీ జనార్దన్, వంటివారి పేర్లు కూడా వినిపించాయి. కానీ, చంద్రబాబు అనూహ్యంగా తనదైన శైలిలో టికెట్లు కేటాయించారు.
ఈ పరిణామం తర్వాత.. వైసీపీ నాయకులు వర్మ కు గేలం వేశారు. ఆయన వచ్చేస్తే పార్టీలోకి తీసుకుంటా మన్న సంకేతాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో టీడీపీ లో ఈ వ్యవహారంపై యాగీ జరిగి.. పార్టీ నేతల మధ్య విభేదాలు రావాలని కోరుకున్న వారు కూడా ఉన్నారు. కానీ, చంద్రబాబు పట్ల విధేయత ఉన్న నాయకులు .. అందరూ.. తమ బాట, మాట.. చంద్రబాబేనని తేల్చి చెప్పడంతో ప్రతిపక్ష నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి వీర విధేయ నాయకులను పొందిన చంద్రబాబు లక్కీనే కదా! అంటున్నారు పరిశీలకులు
This post was last modified on March 11, 2025 6:05 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…