రెండు తెలుగు రాష్ట్రాలకు బీసీ జ్వరం పట్టుకుందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒక్కరు కూడా.. జనరల్ అభ్యర్థికి కేటాయించకపోవడం గమనార్హం. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీలో అయినా.. బీసీలకే పట్టం కట్టారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. ఉన్నవి తక్కువ సంఖ్యే కాబట్టి ఇలా చేశారని అనుకున్నా.. బీసీలకు చాలా వ్యూహాత్మకంగానే టికెట్లు ఇచ్చారు.
ఏపీ విషయానికి వస్తే.. టీడీపీ తనకు దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించింది. రాష్ట్రంలో బీసీ జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారిని మరింత చేరువ చేసుకునే క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆచి తూచి అడుగులు వేశారు. అయితే.. బీసీ నాయకుల్లోనూ చాలా మంది పోటీ పడినా.. వీరిలో అత్యంత విధేయులకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇవ్వడం గమనార్హం.
మరోవైపు.. తెలంగాణలో మూడు స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్ దక్కించుకుంది. వీటిలో సంఖ్యా పరంగా బీసీలకు ఒకటి ఇచ్చినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీలకు కూడా అదేస్థాయిలో ఒక్కొక్క సీటును కేటాయించింది. వీరిలో స్థానిక నాయకులను కాదని.. అధిష్టానం దగ్గరేతేల్చుకున్న విజయశాంతి టికెట్ దక్కించుకోవడం అత్యంత కీలకంగా మారింది. అయితే.. సినీ రంగం ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దూరమైందన్న భావన ఉంది.
ఈ నేపథ్యంలో సినీ రంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విజయశాంతికి టికెట్ ఇచ్చారన్న చర్చ ఉంది. అయితే.. విజయశాంతికి పార్టీ పెద్దలు స్థానిక నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనికి ఆమె ఏమేరకు సహకరిస్తారో చూడాలి. ఇక, మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బీసీనాయకుడు దాసోజు శ్రవణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా.. కాంగ్రెస్ పదే పదే చెబుతున్న బీసీల అనుకూల పార్టీ అనే నినాదం పెద్దగా వినిపించకుండా చేసే వ్యూహం దాగి ఉందన్న చర్చ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on March 11, 2025 1:50 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యద్భుతమైన వేడుకలతో ముగిశాయి. 'ఆంధ్రప్రదేశ్ లెజిస్టేచర్ కల్చరల్ ఈవెనింగ్' పేరిట నిర్వహించిన కార్యక్రమం…
బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు.…
రాజకీయాలకు-సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సినీ రాజకీయాలు.. నిన్న మొన్నటి…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరుగులేదా? ఆయన పాలనా ప్రభ మరింత విరాజిల్లుతోందా? అంటే.. ఔననే అంటున్నాయి జాతీయ…
గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న…