Political News

రోజా, బైరెడ్డిలకు కష్టాలు… ఏం జరుగుతోంది?

ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు చెందిన యువ నేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు గుర్తింపు ఉంది. వైరి వర్గాలను టార్గెట్ చేయడంలో వీరిద్దరిదీ అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. అయితే వీరిద్దరికీ జాయింట్ గానే కష్టాలు మొదలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే… వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు అంటూ ఆడుదాం ఆంధ్రా పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఆరోపణలపై కూటమి సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా అటు రోజాతో పాటు ఇటు బైరెడ్డి కూడా జాయింట్ గానే ఈ కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సమావేశాల్లో ఈ అంశాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి ప్రస్తావించారు. ఆడుదాం ఆంధ్రా పేరిట రూ.400 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం… అందులో క్రీడలతో కాకుండా ప్రజల సొమ్ముతో జగన్ సర్కారు ఆటలాడిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేవలం ప్రచారానికే రూ.35 కోట్లను ఖర్చు చేశారని కూడా ఆమె తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

భూమా వాదనను మరింతగా బలపరచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గౌతు శిరీషలు విచారణకు ఆదేశించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి సమాధానం ఇచ్చి న మంత్రి రాంప్రసాద్ రెడ్డి… ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, విచారణ పూర్తి కాగానే… నివేదికను ప్రభుత్వం ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర కోసం నాటి ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసిన మాటలో వాస్తవం లేదన్న మంత్రి… 45 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రూ.119 కోట్లను ఖర్చు చేశారని వివరించారు. అయితే అందులో మెజారిటీ నిధులను క్రీడా పరికరాలు కొనుగోలు చేసేందుకే వినియోగించినట్లుగా పేర్కొన్నారని ఆయన వివరించారు. అయితే ఆ క్రీడా పరికరాల నాణ్యతపై నాడే విమర్శలు వచ్చాయని… ఈ కారణంగానే కూటమి సర్కారు అధికారంలోకి రాగానే… దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇక ప్రచారం కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయినట్లుగా చూపారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారన్న వివరాలేమీ లేవన్న మంత్రి… మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలిపారు. ఈ విచారణలో అక్రమాలు ఉన్నాయని తేలితే మాత్రం అటు రోజాతో పాటుగా ఇటు బైరెడ్డికి కూడా కష్టాలు తప్పేలా లేవన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

This post was last modified on March 11, 2025 1:40 pm

Share

Recent Posts

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

3 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

4 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

5 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

6 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

6 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

6 hours ago