తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు ఐదేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాలు భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా… మొత్తం 10 స్థానాలకు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ కు అవకాశం లేదనే చెప్పాలి. నామినేషన్లు వేసిన వారంతా దాదాపుగా శాసన మండలికి ఎన్నికవడం లాంఛనమే.
ఏపీలో 5 స్థానాలకు గాను టీడీపీ మూడు సీట్లకు… జనసేన, బీజేపీలు ఒక్కో సీటు చొప్పున అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ సభ్యులుగా ఎంపికైన బీద మస్తాన్ రావు, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంట రాగా… తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. పార్టీ విధేయులకు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని, అప్పటిదాకా వేచి చూడక తప్పదన్నారు. ఈ దఫా అందుబాటులోకి వచ్చిన 3 సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలని అనుకున్నామని… ఆ మేరకే ముగ్గురు అభ్యర్థులను కూడా బలహీన వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేశామని తెలిపారు. జనసేన అభ్యర్థి నాగబాబు ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక బీజేపీ అభ్యర్థిగా ఖరారు అయిన మాజీ ఎమ్మెల్యే సోము వీర్రాజు కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతిలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక విపక్షం బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్ కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు.
This post was last modified on March 10, 2025 5:57 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…