Political News

భారీ జాక్‌పాట్‌: వారికి చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. నిరుద్యోగుల‌కు భారీ జాక్ పాట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తే త‌ప్ప‌.. క‌రుణించ‌ని ప్ర‌భుత్వాల తీరు నిరుద్యోగుల‌కు తెలుసు. అయితే.. ఎలాంటి నిర‌స‌న‌లు లేకుండానే కేవ‌లం చిన్న అభ్య‌ర్థ‌న‌.. గ‌తంలో తాను రా.. క‌ద‌లిరా..! స‌భ‌ల్లో పాల్గొన్న‌ప్పుడు అనేక మంది నిరుద్యోగులు వెల్ల‌డించిన అభిప్రాయాల‌ను దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది భ‌విష్య‌త్తులో నిరుద్యోగుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది.

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు పోటీ ప‌డే అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితిని పెంచుతూ.. కూట‌మి స‌ర్కారు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న వ‌యోప‌రిమితిని 34 సంవ‌త్స‌రాల వ‌య‌సు నుంచి 42 ఏళ్ల‌కు పెంచారు. ఇది అన్ని ర‌కాల ఉద్యోగాల‌కు వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే.. ఒక్క పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్ స‌హా యూనిఫాం స‌ర్వీసుల‌కు మాత్రం మిన‌హాయించారు. యూనిఫాం స‌ర్వీసు ఉద్యోగుల వ‌యోప‌రిమితి మాత్రం జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 38 ఏళ్లుగా ఉంటుంది. ఎస్సీ , ఎస్టీ ఉద్యోగుల‌కు 5 సంవ‌త్స‌రాల రిలాక్సేష‌న్ ఉంటుంది. బీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్ల వెసులుబాటు ఉంటుంది.

వైసీపీ హ‌యాంలోనూ.. ఉద్యోగుల వ‌యోప‌రిమితిని పెంచారు. అప్ప‌ట్లో ఏకంగా జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితిని 42 ఏళ్ల‌కు పెంచారు. దీంతో రాజ‌కీయ ల‌బ్ధి క‌లుగుతుంద‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపించాయి. అయితే.. దీనిపై అప్ప‌ట్లో నిరుద్యోగులే తిర‌గ‌బ‌డ్డారు. త‌మ‌కు అవ‌కాశాలు పోతాయ‌ని.. ఇదేం పెంప‌ని.. ప్ర‌శ్నిస్తూ.. చాలా మంది కోర్టును కూడా ఆశ్ర‌యించారు. దీంతో స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. ఆ త‌ర్వాత‌.. అస‌లు ఎలాంటి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో.. దీనిపై పెద్ద‌గా చ‌ర్చ‌లేకుండా పోయింది. ఇదిలావుంటే.. తాజాగా కూట‌మి స‌ర్కారు ఇచ్చిన వెసులుబాటు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న డీఎస్సీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఇది ఒక‌ర‌కంగా ఉద్యోగుల‌కు జాక్ పాటే అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on March 5, 2025 6:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య ఫార్ములా….తమన్నాకు కలిసొచ్చింది

ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…

10 minutes ago

ఈ కండక్టర్ టికెట్లు కొట్టడం కష్టమే!

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…

22 minutes ago

ఈ చిన్న లాజిక్కును జ‌గ‌న్ మిస్స‌య్యారు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు భ‌విష్య‌త్తు మార్గాల‌ను చూపిస్తున్నాయా? ఆదిశ‌గా…

1 hour ago

జగన్ ను ఆపే దమ్ముంది.. కానీ: పరిటాల సునీత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…

1 hour ago

బిగ్ బ్రేకింగ్… గ్యాస్ బండపై రూ.50 పెంపు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ…

2 hours ago

షాకింగ్ : కాంతార హీరోకు పంజుర్లి హెచ్చరిక

పెద్దగా అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్లతో రూపొంది మూడు వందల కోట్లకు పైగా సాధించిన బ్లాక్ బస్టర్ గా…

2 hours ago