Political News

అన్ని దారులు లోకేష్ వైపే

కొన్నికొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ విష‌యంలో జ‌రుగుతోంది. “లోకేష్ స‌ర్ ఇప్ప‌ట్లో ఎవ‌రినీ క‌ల‌వ‌రు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబ‌ర్‌లోను.. ఆయ‌న నివాసంలోనూ ప‌నిచేస్తున్న పీఏలు, సెక్ర‌ట‌రీలు చెబుతున్న మాట‌. అది కూడా.. టీడీపీ సీనియ‌ర్ల‌కే చెబుతున్న మాట‌. ఇదేమీ చిత్ర‌మైన విష‌యం కాదు. చాలా సీరియ‌స్ ఇష్యూనే.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ వ‌చ్చింది. దీంతో ఆశావ‌హులు.. వారి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. కొంద‌రు.. నేరుగా సీఎం చంద్ర‌బాబును క‌లుస్తున్నారు. వీరిలో టీడీ జనార్ద‌న్‌, నెట్టెం ర‌ఘురాం వంటి సీనియ‌ర్ మోస్టులు కూడా ఉన్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ వ‌దులుకున్న వారు స‌రేస‌రి! వారు నేరుగా చంద్ర‌బాబును క‌ల‌వ‌క పోయినా.. త‌మ‌ను గుర్తు తెచ్చేలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

తాజాగా రా.. క‌ద‌లిరా! కార్య‌క్రమం ప్రారంభించి.. ఏడాది పూర్త‌యిందంటూ.. గుంటూరులో జంగా కృష్ణ‌మూర్తి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇదే కార్యక్ర‌మంపై మైల‌వ‌రంలోమాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా అనుచ‌రులు కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే.. ఆయా కార్య‌క్ర‌మాల‌ను గుర్తు చేయ‌డం ద్వారా.. తాము లైవ్‌లో ఉన్నామ‌న్న విష‌యాన్ని వారు చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఇక‌, చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంటు దొర‌క‌ని వారు.. నారా లోకేష్‌ చెబితే ప‌ని అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉన్న‌వారు.. ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దీంతో గ‌త రెండు రోజుల నుంచి నారా లోకేష్‌ను క‌ల‌వాల‌ని కోరుతూ.. అప్పాయింట్‌మెంటు ఇప్పించాల‌ని అభ్య‌ర్థిస్తూ.. అనేక మంది నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. అయితే.. గ‌తంలో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకున్న నారా లోకేస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు.. ఇలాంటి అభ్య‌ర్థ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే ఎవ‌రికీ అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న పీఏలు, సెక్ర‌ట‌రీలు.. సార్ బిజీగా ఉన్నారంటూ పోన్లు పెట్టేస్తున్నార‌ట‌.

This post was last modified on March 4, 2025 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago