ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది.
మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు… ఈ దఫా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికను రచించారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణలో ఏకంగా 1,02,832 మంది మహిళలు పాలుపంచుకోనున్నారు. శిక్షణ తర్వాత టైలరింగ్ లో సదరు మహిళలు ఆర్థికార్జనకు అవసరమైన ఇతరత్రా చేయూతను కూడా బాబు సర్కారు అందించనుంది. వెరసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది.
90 రోజుల పాటు జరగనున్న టైలరింగ్ శిక్షణా కార్యక్రమాలకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీఎస్), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు. ఇక ఈ శిక్షణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న ఈ శిక్షణా కేంద్రాల్లో 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
This post was last modified on March 2, 2025 9:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…