టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సామాజిక పింఛన్ల పంపిణీలో పాలుపంచుకునే నిమిత్తం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడుపల్లెకు వెళ్లారు. అక్కడ పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు… ఆయా కుటుంబ సభ్యులతో హుషారుగా గడిపారు. ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇద్దరు బాలికలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి… వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందే చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరీ తన ఇంటి నుంచి బయలుదేరారు.
చంద్రబాబు తీసుకున్న ఆ రెండు నిర్ణయాల కారణంగా ఏకంగా 2 లక్షల మంది దాకా ఉద్యోగులకు భారీ ఊరట లబించిందని చెప్పాలి. వాటిలో మొదటిదాని విషయానికి వస్తే… రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ సర్కారు ఏకంగా 1.6 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. ప్రభుత్వ నిబంధనల మేరకే వీరి నియామకం జరగడంతో వాలంటీర్ల మాదిరిగా వీరిని సర్వీసు నుంచి తొలగించడం కుదరలేదు.
దీంతో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కారు… వారిని ఆయా సచివాలయాల్లో సర్దుబాటు, మిగిలిన వారిని ఇతర శాఖలకు మళ్లించడం వంటి హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి శనివారం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 1.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయన ఉద్యోగ భద్రతను కల్పించినట్లైంది.
ఇక చంద్రబాబు తీసుకున్న రెండో నిర్ణయం ఏమిటంటే… రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల రిటైర్ మెంట్ వయసును ఏపీ ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచింది. అంటే… వారి కొలువుల కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచడమే కదా. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక వీరికి ఇప్పటిదాకా అందుతున్న ఇతరత్రా ప్రయోజనాలను కూడా మరింతగా పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఆశా వర్కర్లకు తొలి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఇతర శాఖల ఉద్యోగుల మాదిరే ఆశా వర్కర్లకు కూడా ఆర్థిక భరోసా అందించేలా గ్రాట్యూటీ ఇవ్వాలని కూడా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ సమయంలో ఒక్కో ఆశా వర్కర్ కు రూ.1.5 లక్షల మేర ప్రయోజనం దక్కనుంది.
This post was last modified on March 1, 2025 5:24 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…