ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వైరి వర్గాల నేతలు, వారి కుటుంబాలపై విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేసిన వారు వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ తరహా అరెస్టులపై అటు వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతోందని, అందులో భాగంగానే విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ తరహా ప్రశ్నలకు జనసేన కీలక నేత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
శనివారం కందుల దుర్గేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా… అందులోనూ కొందరు మీడియా ప్రతినిధుల నుంచి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న విన్నంతనే… వెంటనే రియాక్ట్ అయిన మంత్రి… ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామంటే… తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ అరెస్టులు జరిగేవి కదా అంటూ మంత్రి దుర్గేశ్ సమాధానమిచ్చారు. ఈ ఒక్క ప్రశ్నతో రెడ్ బుక్ తరహా ప్రశ్నలన్నింటికీ దుర్గేశ్ సింగిల్ మాటతో ఆన్సరిచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును ప్రస్తావించిన మీడియా ప్రతినిధులు… పోసాని వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పారు కదా అని గుర్తు చేశారు. పోసాని చెప్పిన దాని ప్రకారం సజ్జలపై చర్యలు ఉంటాయా? అని కూడా మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన దుర్గేశ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని బదులిచ్చారు. ఈ మాటకు ముందు ఆయన రొటీన్ డైలాగే అయినా ఇదే కరెక్ట్ సమాధానమని వ్యాఖ్యానించి మీడియా ప్రతినిధులను నవ్వుల్లో ముంచేశారు.
This post was last modified on March 1, 2025 1:48 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…