ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు సరికొత్త నిర్ణయాలతో సత్తా చాటుతోంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి.. రెంటినీ రెండు కళ్ల మాదిరిగా భావిస్తూ సాగుతోంది. వీటిలో దేనిని కూడా నిర్లక్ష్యం చేయరాదన్న ధోరణితో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సాగుతున్నారు. అందులో భాగంగా అప్పటిదాకా ఉన్న పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలకు తిలోదకాలిచ్చేందుకు కూడా ఆయన ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ దిశగా ఇప్పుడు స్థానిక సంస్థల నిధుల వినియోగానికి సంబంధించి చంద్రబాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ప్రకారం.. పన్నులు పక్కాగా కట్టే ప్రజలున్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. అదే సమయంలో పన్ను చెల్లింపులో జాప్యం చేసే ప్రజలకు అభివృద్ధి కాస్తంత ఆలస్యం కూడా కానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు నేరుగానే చెప్పేసే అవకాశాలూ లేకపోలేదు.
బాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం… నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో క్రమం తప్పకుండా ప్రజలు పన్నులు కడుతూనే ఉన్నారు. ఈ పన్నుల ద్వారా పోగయ్యే నిధులను ఆయా ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేవి. అంటే.. కర్నూలు కార్పొరేషన్ లో వసూలు అయ్యే నిధులను ఎక్కడో విశాఖలోనో, లేదంటే ఏదైనా పథకం అమలు కోసమో వినియోగించేవారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగే నాథుడు ఇప్పటిదాకా లేరనే చెప్పాలి. ఇలా పన్ను కట్టిన ప్రజలు… పన్నులు కడుతున్నా.. సమస్యలు పరిష్కారం కాలేదే అంటూ గగ్గోలు పెట్టినా పట్టించుకున్న యంత్రాంగం లేదనే చెప్పాలి.
అయితే ఇప్పుడు బాబు సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కర్నూలు కార్పొరేషన్ లో వసూలు అయ్యే పన్నులతో అక్కడే అభివృద్ధి పనులను చేపడతారు. అంటే…ఎక్కడ వసూలు అయ్యే నిధులు అక్కడి అభివృద్ధి పనులకే వినియోగిస్తారన్న మాట. అంటే.. కర్నూలు నగర పాలక సంస్థ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లిస్తే… నగరంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత అన్న మాటే ఉండదు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పన్ను వసూలు అంచనాలతో పనులు నిర్దేశించుకుని చేసుకుపోవడం అన్నది నిరంతరాయంగా జరిగిపోతుంది. వెరసి నగరంలో పెద్దగా సమస్యలన్నవే ఉత్పన్నం కావన్న మాట. ఒకవేళ ఏదేనీ ఉత్పాతం జరిగినా.. ఇటు రాష్ట్రం నుంచో, లేదంటే అటు కేంద్రం నుంచో నిధులు వస్తే.. వాటితో ఆ పెద్ద సమస్యలను తీర్చేందుకు అవకాశం ఉంటుంది.
This post was last modified on March 1, 2025 1:19 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…